Advertisement
చీతా.. లిపార్డ్.. జాగ్వార్.. తెలుగులో ఈ మూడింటినీ చిరుతపులి అనే పిలుస్తారు. అయితే నిజానికి ఇవి చిరుతపులి జాతికి చెందినా.. భిన్నమైన జంతువులు. వీటి శరీర ఆకృతి భిన్నంగా ఉంటుంది. ఇవి మిక్కిలి శారీరక దారుఢ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. శత్రువులను కేవలం ఒకే ఒక్క పంజాతో చంపగల శక్తి వీటి సొంతం. అయితే ఈ మూడూ.. చిరుతపులి జాతికి చెందినవే అయినా.. క్రూర మృగాలే అయినా.. వీటిలో ఒకే ఒక్క జంతువు మాత్రమే మిక్కిలి ప్రమాదకరం.. ఇతర రెండు పులుల కన్నా ఒక పులి అత్యంత ప్రమాదకరమైంది. అదేమిటంటే…
చీతాలు 21 నుంచి 71 కిలోల వరకు బరువు కలిగి ఉంటాయి. ఇవి లిపార్డ్‌ల కన్నా పొడవుగా ఉంటాయి. భుజాల వద్ద 55 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వీటి పంజాలు చాలా దగ్గరికి ఉంటాయి. ఇతర రెండు పులుల కన్నా వీటి పంజా తక్కువ పొడవు ఉంటుంది. ఇవి ఇతర రెండు పులుల కన్నా ఎక్కువ వేగంగా పరిగెత్తగలవు. కానీ వీటికి బలం తక్కువగా ఉంటుంది. అందువల్ల చీతాలు ఇతర రెండు పులులతో పోలిస్తే కాస్త బలహీనమైనవనే చెప్పవచ్చు. ఇవి అంత ప్రమాదకరం కాదు.
Advertisement
Advertisements
లిపార్డ్‌లు భుజాల వద్ద 60 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఇవి 37 నుంచి 90 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇవి చీటాల నుంచి జంతువుల కళేబరాలను లాక్కుని తినగలవు. అందువల్ల ఇవి చీటాల కన్నా బలమైనవే. కానీ జాగ్వార్‌ల కన్నా వీటికి బలం తక్కువగా ఉంటుంది.
Advertisements
ఇక చివరిగా జాగ్వార్‌ల విషయానికి వస్తే.. ఇవి చాలా దృఢమైన శరీర సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. వీటికి సాధారణ పులులు, సింహాలంత బలం ఉంటుంది. ఇవి 56 నుంచి 96 కిలోల వరకు బరువు పెరుగుతాయి. చీటాలు, లిపార్డ్‌ల కన్నా జాగ్వార్‌లు మిక్కిలి బలమైనవి మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమైనవి కూడా. అందువల్ల జాగ్వార్‌లు అత్యంత బలమైన, ప్రమాదకరమైన జంతువులు.. అని చెప్పవచ్చు.