Advertisement
ఇంటి ముందు నా ఇద్దరు తమ్ముళ్ళతో హాయ్ గా ఆడుకుంటున్నాను.,అంతలోనే మా నాన్న స్నేహితులిద్దరు మా ఇంటికొచ్చారు. ఏదో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మ వాళ్లకు టీ ఇచ్చింది..! వారు వెళ్ళేటప్పుడు నన్ను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లారు. వారు వెళ్ళగానే మా అమ్మ నా తలమీద చెయ్ పెట్టి నిమిరింది.
సరిగ్గా పది రోజుల తర్వాత…నన్ను రెడీ చేస్తున్నారు? ‘ఎందుకు మనమేమైనా ఊరికెళుతున్నామా ?’ అని మా అమ్మను అడిగాను. ‘లేదమ్మా..ఈరోజు నీకు పెళ్లి’ అని చెప్పింది అమ్మ.! అప్పుడు నా వయస్సు సరిగ్గా 14 ఏళ్ళు… ‘అమ్మ వొద్దమ్మా., నేను చదువుకుంటా.. నాకీ పెళ్ళొద్దు, మీరు చెప్పినట్టే వింటా, నాన్నను అసలే విసిగించను’… అని ఎంతగా బతిమిలాడినా నా మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు.
కేవలం సెక్స్ కోసమే పెళ్లి చేసుకున్నట్టుగా ప్రవర్తించేవాడు నా భర్త స్తానంలో ఉన్న ఆ వ్యక్తి (నేను భర్త గా అతనిని అంగీకరించలేను) ఏడాదిలోపే ప్రెగ్నెంట్ అయ్యాను, కొంత కాలానికే అబార్షన్ కూడా అయ్యింది. ( మంచిదే….ఈ పాపిష్టి లోకంలో పుట్టడం కంటే కళ్ళు తెరవకముందే కాటికి పోవడం మంచిదే)
Advertisement
బడికి వెళ్లాలన్న నా కోరిక ఇంకా అలాగే ఉంది., నన్ను అనుభవించాలనే అతని కోరిక ఇంకా బలంగా ఉంది. అందుకే నేను బడికి వెళ్తానంటే విపరీతంగా కొట్టేవాడు., అప్పటికీ దొంగ చాటుగా నేను పుస్తకాలు చదివేదానిని..ఎప్పుడైనా పుస్తకాలతో అయన కంటికి కనిపిస్తే, కనికరం లేకుండా కొట్టేవాడు.
Advertisements
అలా ఓ రోజు దెబ్బలకు తాలలేక మా ఇంటికి పారిపోయి వొచ్చాను. ‘భర్తకు చెప్పకుండా పారిపోయి వస్తావా ? నా పరువు తీస్తావా.?’ అంటూ మా నాన్న మరింతగా కొట్టాడు. సొమ్మసిల్లి పడిపోయాను. తెల్లారి లేచి చూసే సరికి నా భర్త అనే వ్యక్తి వచ్చి ఉన్నాడు. నన్ను తనతో పంపించాలంటున్నాడు.
ఈ సారి మా అమ్మ ధైర్యం చేసింది.. ‘నా కూతుర్ని పంపించేది లేద’ని తెగేసి చెప్పింది. ( బహుశా మొదటి సారి మా నాన్నకు ఎదురు మాట్లాడింది అనుకుంటా). మా నాన్న అమ్మను బెదిరించబోయాడు…’నేను నా కూతురు అవసరమైతే బయటికి వెళ్లైనా బతుకుతాం కానీ తనను ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించానని ఖరాఖండిగా చెప్పింది’. ( కూతురి బాధను అర్థం చేసుకుంది కాబోలు )
అతనెళ్ళిపోయాడు…అలా కొన్ని రోజులు గడిచాయి, అతడు చేసిన గాయాలు ఒక్కొక్కటిగా మానుతున్నాయి. కానీ చదువుకోవాలనే నా కోరిక మాత్రం నన్ను ఇంకా బాధిస్తూనే ఉంది. ఏమైందో ఏమో సడన్ గా మా నాన్న పుస్తకాల బాగ్ ను తెచ్చి ఇచ్చి ‘బేటా రేపటి నుండి బడికెళ్ళి హాయ్ గా చదువుకో అన్నాడు’. ( మా నాన్న లో మార్పుకు కారణం ఏంటో నాకిప్పటికీ అర్థం కాలేదు)
Advertisements