Advertisement
బాల్యం మధురజ్ఞాపకాల వసంతం! అందుకే ఉందో లేదో ఆ స్వర్గం నా బాల్యం నాకిచ్చెయ్ అంటారు రెంటాల! అందుకే అప్పుడప్పుడు మనమంతా మన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ …ఆ రోజులే వేరంటూ మన చిలిపి పనులను నెమరేసుకుంటుంటాం! అలా 90వ దశకంలోని బాల్యంలో ఈ 5 సినిమాలు కూడా భాగమైపోయాయి.! మనల్ని మనం హీరోలుగా ఊహించిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
సిసింద్రీ :
టివిల్లో ఎన్ని సార్లు చూసుంటామో ఈ సినిమాను…..నాగార్జున కొడుకు అఖిల్ నటించిన ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరీ! చిన్నితండ్రీ అంటూ మన అమ్మలే సైతం మనల్ని ముద్దు చేసిన సందర్భాలెన్నో కదా! 1995లో విడుదలైన ఈ సినిమాను శివనాగేశ్వర్రావ్ డైరెక్ట్ చేశారు.
అంజలి:
Advertisements
బేబీ షామిలీ, తరుణ్ లను హైపర్ కిడ్స్ గా ప్రజెంట్ చేస్తూ మణిరత్నం తీసిన ఈ సినిమా మన చైల్డ్ వుడ్ మెమొరీ!
లిటిల్ సోల్జర్స్ :
Advertisement
క్రైమ్, సస్పెన్స్‌లకు కామెడీని జోడించి గుణ్ణం గంగరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా మన బాల్యస్మృతుల్లో ఒకటి. ఐయామ్ వెరీ గుడ్ గర్ల్ అనే పాట విన్నప్పుడల్లా బాల్యం కళ్లముందు గిర్రున తిరుగుతుంది.
పాపం పసివాడు:
దక్షిణాఫ్రికా సినిమా అయిన లాస్ట్ ఇన్ ది డిజర్ట్ అనే సినిమాను రిమేక్ చేస్తూ తెలుగులో వి. రామచంద్రరావు తెలుగులో 1972 లో పాపం పసివాడు అనే పేరుతో ఈ సినిమాను తీశారు. ఎడారిలో ఆ బాబు కష్టాలు., అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి అనే పాట మనల్ని కంటతడి పెట్టించింది.
బాల రామాయణం :
జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారిగా నటించిన బాలరామాయణంను గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా విమర్శకుల నుండి మంచి గుర్తింపు లభించింది. రామాయణంలోని నీతి కోసం మన పేరెంట్స్ ఈ సినిమాను తెగ చూపించేవారు.
Advertisements