Advertisement
చనిపోయిన మనుషులు బతికి రావడం.. ఎన్ని ఏళ్లు గడిచినా వారు యవ్వనంగానే ఉండడం.. తదితర అంశాలన్నింటినీ మనం ఇప్పటి వరకు సినిమా తెరపైనే చూశాం. సైన్స్ ఎంతో వృద్ధి చెందింది. కానీ సైంటిస్టులు ఇంకా ఈ రెండు అంశాలకు ఇంకా పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేయలేకపోతారు. ఈ రెండు అంశాల్లోనూ వారు ఇప్పటి వరకు విజయం సాధించలేదు. కానీ చైనాకు చెందిన సైంటిస్టులు మాత్రం వీటిని సాధించే పనిలో పడ్డారు.
చైనాలోని షాన్‌డాంగ్ యిన్‌ఫెంగ్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ సైంటిస్టులు క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. చైనాలో అదొక్కటే క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్ ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా అలాంటివి మరో మూడు చోట్ల.. మొత్తం కలిపి నాలుగు క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో మానవ శరీరాలను అత్యంత శీతలమైన ఉష్ణోగ్రతలకు గడ్డ కట్టిస్తారు. మనకు సినిమాల్లో చూపించేది కూడా ఇదే. అలా కొన్నేళ్ల పాటు చేశాక.. ఆ శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తారు. మళ్లీ ఆ శరీరానికి ప్రాణం పోస్తారు. దీంతో చనిపోయిన వారు మళ్లీ బతికి వస్తారు. అలాగే వారు ఈ విధానంతో ఎప్పటికీ యవ్వనంగానే ఉంటారు.
Advertisement
నిజానికి క్రయోనిక్స్ ప్రయోగాలను మనం సినిమాల్లో చూశాం కానీ.. నిజ జీవితంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తారా ? అని కూడా నమ్మలేదు. కానీ చైనాకు చెందిన సైంటిస్టులు ఇప్పుడు అవే ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అవి సక్సెస్ కాకపోయినా క్రయోనిక్స్ వల్ల మరో లాభం కూడా ఏర్పడింది. అదేమిటంటే.. సాధారణంగా అవయవ దానం చేసిన వ్యక్తులు చనిపోయాక వారి శరీరం నుంచి అవయవాలను సేకరించి ఇతరుల శరీరాల్లో మార్పిడి చేస్తుంటారు. అయితే అందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఒక్కో అవయవానికి నిర్దిష్టమైన కాల పరిమితి ఉంటుంది. ఆ సమయంలోగా ఆ అవయవాలను మార్పిడి చేయాలి. అయితే వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేసేందుకే సమయం ఎక్కువ పడుతుంది. కానీ క్రయోనిక్స్ ద్వారా ఆ కాల పరిమితిని కొన్ని గంటల నుంచి ఏకంగా 6 రోజుల వరకు పెంచవచ్చు. దీని వల్ల వైద్యులు విజయవంతంగా అవయవ మార్పిడి చేయవచ్చు. అలాగే ప్రపంచంలో డోనార్లు ఎక్కడ ఉన్నా గ్రహీతల వద్దకు అవయవాలను సేఫ్‌గా, చెడిపోకుండా తీసుకు రావచ్చు.
Advertisements
Advertisements
అయితే క్రయోనిక్స్ వల్ల అవయవ మార్పిడికి సంబంధించి పైన తెలిపిన విధంగా అవకాశం ఉన్నా.. నిజానికి క్రయోనిక్స్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల అది మనకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా ఎక్కువ సమయమే పట్టేందుకు అవకాశం ఉంది. అయితే క్రయోనిక్స్ వల్ల ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో మనకు లాభం ఉన్నప్పటికీ ఆ విధానం వల్ల చనిపోయిన వారిని బతికించడం, వయస్సు ఎప్పటికీ తగ్గకుండా చేయడం.. వంటివన్నీ సైన్స్‌కు అందని విషయాలు. వాటిల్లో సైంటిస్టులు విజయం సాధిస్తారని మాత్రం అనుకోవడం లేదు. ఏమో.. భవిష్యత్తులో మనిషి మృత్యువును కూడా జయించే రోజులు రావచ్చు. చెప్పలేం..!