Advertisement
కరోనాతో ఓ వైపు ప్రపంచమంతా అల్లాడిపోతోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంతో మంది కరోనా మహమ్మారికి బలవుతున్నారు. అయితే మరోవైపు చైనా వాసులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వేలాది మంది ఒకే చోట చేరి భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండా పార్టీలు చేసుకుంటున్నారు. తాజాగా వూహాన్ సిటీలోని ఓ వాటర్ పార్కులో చైనీయులు పెద్ద ఎత్తున గుమిగూడి కరోనా అంటే ఏమాత్రం భయం లేకుండా పార్టీ చేసుకున్నారు.
కరోనా వైరస్ కేసులు ముందుగా వూహాన్ సిటీలో నమోదైన సంగతి తెలిసిందే. అయితే అక్కడ సుమారుగా 76 రోజుల లాక్‌డౌన్ అనంతరం జూన్ నెలలో ఆంక్షలను పూర్తిగా ఎత్తేశారు. దీంతో అన్ని కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. ఇక అక్కడి వూహాన్ సిటీలోని మాయా బీచ్ వాటర్ పార్క్‌లో మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించారు. దీంతో ఆ వాటర్ పార్క్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. ఆ పార్క్ సాధారణ కెపాసిటీలో 50 శాతం వరకు నిండిపోయింది. అయినప్పటికీ జనాలు బాగా రావడంతో పార్క్ కిక్కిరిసింది. ఇసుకవేస్తే రాలనంత జనాలు పార్క్‌కు వచ్చారు. తరువాత అందులో మ్యూజిక్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
Advertisement
అయితే ఆ పార్కులో జనాలు ఎక్కడా కరోనా నిబంధనలు పాటించలేదు. సోషల్ డిస్టాన్స్ ఊసు లేదు. ముక్కులకు మాస్కులు లేవు. అసలు కరోనా లేదు.. బయటి ప్రపంచంతో మాకు సంబంధం లేదు.. అన్నట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆ పార్కులో తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనాతో తీవ్రంగా భయపడుతుంటే.. మరోవైపు చైనీయులు అలా వాటర్ పార్క్‌లో సంబరాల్లో మునిగి తేలడం, అందులోనూ ఏమాత్రం కరోనా అంటే భయం లేకుండా ప్రవర్తించడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇక చైనీయుల వైఖరి పట్ల అనుమానాలూ కలుగుతున్నాయి. మొదట్నుంచీ నిజానికి కరోనా వ్యవహారంలో చైనా ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉంది. ఇక తాజాగా ఈ ఫొటో ఆ దేశం అసలు స్వరూపాన్ని బయట పెట్టింది. దీంతో చైనా కావాలనే కరోనా వైరస్‌ను బయటి ప్రపంచం మీదకు వదిలిందని, ప్రపంచమంతా ఇప్పుడు ఆ వైరస్ ధాటికి బెంబేలెత్తిపోతుంటే.. చైనా ఇప్పుడు తాపీగా ఉందని.. అసలు వారు ముందే వ్యాక్సిన్‌ను కనిపెట్టి దాన్ని వేసుకున్నారని.. అందుకే ఇప్పుడిలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే కరోనా విషయంలో చైనా ఒక వేళ నిజంగానే వాస్తవాలను దాచి పెట్టి ఉంటే గనక అవి ఎప్పటికైనా బయట పడక తప్పదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
Meanwhile in #Wuhan
pic.twitter.com/Jt69CrNzzy— Josh K. Elliott (@joshkelliott) August 17, 2020
Advertisements