Advertisement
వివాహాలను ఎంత సాదాసీదాగా చేసుకున్నా సరే.. అతిథులకు మాత్రం విందు భోజనాలు పెడతారు. భోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడరు. వివాహ శుభకార్యం అత్యంత సాధారణంగా, నిరాడంబరంగా జరుపుకున్నా.. విందు భోజనం మాత్రం పెడతారు. అయితే ఒక చోట వివాహ విందులో మరీ చిన్న పిల్లలకు లంచ్‌లో పెట్టే భోజనం పెట్టారు. దీంతో ఆ వివాహానికి వచ్చిన వారు షాకయ్యారు. ఫేస్‌బుక్ లో ఈ మేరకు ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Advertisement
వివాహ విందుల్లో ఎవరి స్థోమతకు తగినట్టుగా వారు ఫుడ్ అరేంజ్ చేస్తారు. అయితే ఓ వివాహ విందులో మాత్రం అతిథులకు చిప్స్, సగం శాండ్ విచ్, కొన్ని కూరగాలు, పండ్ల ముక్కలు పెట్టారు. అదే వివాహ విందుగా చెబుతూ ఆ ఫుడ్‌ను గెస్ట్‌లకు సర్వ్ చేశారు. దీంతో గెస్ట్‌లు షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో ఆ ఫుడ్‌కు చెందిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
Advertisements
ఇక వివాహ విందులో అలా చిన్నపిల్లలకు పెట్టినట్లుగా ఫుడ్ పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌లు అంటే మరీ అంత చీప్‌గా ఉందా.. చిన్న పిల్లలకు పెట్టే ఫుడ్‌ను విందు భోజనమని పెడతారా ?.. నేను నా పిల్లలకు లంచ్‌లో చిప్స్ తప్ప ఆ మిగిలిన ఫుడ్‌ను పెడతాను.. అని ఇలా రక రకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వివాహానికి చాలా తక్కువ మంది హాజరు కావడం వల్లే ఇలా వారు ఫుడ్ పెట్టారని తెలుస్తోంది.
Advertisements