Advertisement
కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.! ఆనందంగా సాగుతున్న జీవితం…ప్రేమించిన అమ్మాయినే భాగస్వామిగా చేసుకున్నాడు. చేతిలో సినిమాలున్నాయి. ఆర్థికంగా సెటిల్ అయ్యిన కుటుంబమే.! మరికొన్ని రోజుల్లో కొడుకో..కూతురో పుట్టనున్నారు.! లాక్ డౌన్ లో హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఉదయం కూడా ఉల్లాసంగా గడిపాడు…మద్యాహ్నం సరికల్లా గుండెపోటు తో మరణించాడు.! అది కూడా 39 సంవత్సరాల వయస్సులో…..!
ప్రేమించి…తనే కావాలని కుటుంబాన్ని ఒప్పించి మరీ చేసుకున్న భార్యను ఒంటరిగా చేసి వెళ్లిపోయాడు. ఇంకా కళ్లు తెరవని బిడ్డకు తండ్రిని చూసే భాగ్యం లేకుండా చేసి వెళ్లిపోయాడు. ఓ విషాదాంత సినిమాలా ముగిసింది సర్జా జీవితం.
Advertisement
సర్జా స్థానంలో మనల్ని మనం ఊహించుకుందాం! కళ్లు బైర్లు కమ్ముతున్నాయి కదూ…! కానీ చెప్పలేం..దేవుడి స్క్రీన్ ప్లే ఎలా ఉందో.!? మన జీవితం చాలా చిన్నది…అందుకే దొరికిన ప్రతి చిన్న సమయాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి… గందరగోళాలతో.. ఈర్ష్యా అసూయలతో …నేను అనే అహంతో బతకడం వేస్ట్ ! అందరి కోసం నేను అనే భావనతో ఉండండి.!
Advertisements
Advertisements
పక్కోడితో మనల్ని మనం పోల్చుకునే దిక్కుమాలిన ఆలోచనలను పక్కకు పెడదాం.! జీతంతో జీవితాన్ని కొలిచే కొలమానాల్ని విడనాడుదాం.! లైఫ్ ను సంతోషాలతో సరదాలతో , ఆత్మీయత అనురాగాలతో తూకం వేద్దాం.! ఏం తెలుసు ఇదే మనకు చివరి రోజేమో.!