Advertisement
చిరంజీవి…… సైడ్ క్యారెక్టర్లతో సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఎక్స్ ప్రెషన్స్ , యాక్టింగ్ , డాన్స్ అన్నింట్లో ది బెస్ట్ ఇస్తూ గొప్ప నటుడిగా నిలిచాడు.! ఎన్నో హిట్లు, ఇంకెన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్…ఇలా ఎన్నో తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ….చిరంజీవిలోని అసలైన నటుడిని బయటకు చూపించిన కొన్ని సినిమాలున్నాయి. ఆ సినిమాలేంటో చూడండి
1. పున్నమి నాగు:
1980 లో రిలీజై సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో ప్రతీ పౌర్ణమికి ఒక పాములాగా మారుతూ బిహేవ్ చేసే నాగులు అనే క్యారెక్టర్లో చిరంజీవి అద్భుతంగా నటించారు . క్లైమాక్స్ లో ఇలా మారడానికి కారణం తెలుసుకొని దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ చివరికి సూ _ సైడ్ చేసుకొని చనిపోతాడు . చిరంజీవికి అద్భుత నటుడిగా పేరు తెచ్చింది ఈ సినిమానే!
2. శుభలేఖ:
Advertisements
1982 లో రిలీజై సూపర్ హిట్టయిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ . మూర్తి అనే క్యారెక్టర్లో చిరంజీవి కనబరిచిన నటనకు గాను ఫస్ట్ టైమ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది . కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా చిరంజీవిలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది.
3.అభిలాష:
1983 లో రిలీజైన ఈ సినిమాలో ఉరిశిక్షని రద్దు చేయించడానికి ప్రయత్నించే ఒక లాయర్ క్యారెక్టర్ చేసాడు చిరు . ఇటు కామెడీ అటు ఎమోషన్స్ ని అద్భుతంగా పండించారు చిరు .
4. ఖైదీ:
పగ పగ అంటూ రగిలిపోయే సూర్యం క్యారెక్టర్లో రౌద్ర రసాన్ని ఎక్సలెంట్ గా చూపించాడు చిరు . 1983 లో రిలీజై ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోగా నిలిబెట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఖైదీ మైండ్ బ్లాక్ అయ్యే వసూళ్లను రాబట్టింది!
5. విజేత:
ఒక మిడిల్ క్లాస్ యువకుడు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి కిడ్నీ దానం చేసి ఆ డబ్బుతో నాన్న పరువుని చెల్లి పెళ్లిని నిలబెడతాడు ! 1985 లో రిలీజై సూపర్ హిట్టయిన ఈ మూవీలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది . తన నటనకు మరోసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లభించింది.
Advertisement
6. చంటబ్బాయ్:
1986 లో జంధ్యాల డైరెక్షన్లో రిలీజైన చంటబ్బాయ్ ప్లాప్ అంటే అసలు నమ్మబుద్దికాదు . అంత బాగుంటుంది ఈ సినిమా . టాప్ హీరోగా ఉన్న చిరు ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఫుల్ లెంత్ కామెడి రోల్ చేయడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ .
7.స్వయంకృషి:
స్టార్ హీరో హోదాలో ఉండి….చెప్పులు కుట్టే క్యారెక్టర్ ను ఒప్పుకొని ఆ పాత్రలో ఒదిగిపోయాడు చిరంజీవి.! 1987లో రిలీజైన ఈ సినిమా అటు కమర్షియల్ గా ఇటు క్లాసిక్ గా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ లభించింది.
8. రుద్రవీణ:
1988 లో మెగాస్టార్ చేసిన ఇంకో ప్రయోగం రుద్రవీణ. అద్భుతమైన సినిమాగా అందరి ప్రశంసలు పొంది కల్ట్ క్లాసిక్ గా నిలబడిన ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయింది .ఈ సినిమా ఏకంగా 3 నేషనల్ అవార్డ్స్ సాధించింది.
9. ఆపద్బాంధవుడు:
సౌతిండియా మొత్తం చిరంజీవి పేరు మారు మోగిపోయేలా చేసిన సినిమా ఇది.!1992 లో రిలీజైన ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు లభించాయి.!
10. సైరా:
చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ తనలోని అద్భుతమైన నటుడ్ని బయటకి తీసిన సినిమా సైరా నర్సింహ రెడ్డి . 2019 లో భారీ అంచనాలతో రిలీజైన మిశ్రమ ఫలితాలను సాధించింది. ఫస్ట్ టైమ్ ఒక చారిత్రాత్మక కథతో ఒక ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటించిన చిరంజీవి నటన పరంగా అదరగొట్టాడు . ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటన ఏమోషనల్ గా ఎడిపించేశాడు.
Advertisements
కమర్షియల్ గా చిరంజీవికి అనేక హిట్ సినిమాలు ఉన్నప్పటికీ…యాక్టింగ్ పరంగా ది బెస్ట్ అనుకున్న సినిమాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చిరంజీవి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలేవో, ఎందుకో కామెంట్ రూపంలో తెలియజేయండి!