Advertisement
సంక్రాంతి అంటే తెలుగు వాళ్లకు ఎంతపెద్ద పండగో….సినిమా వాళ్లకు కూడా.! అందుకే ఖచ్చితంగా 2,3 సినిమాలు సంక్రాంతికి ఠంచనుగా రిలీజ్ అవుతాయి. పండుగకు తోడు సెలవులు కూడా ఉంటాయి కాబట్టి సినిమాలకు కలెక్షన్లు కూడా భారీగా వస్తాయి అందుకే టాప్ హీరోలు…తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. అలా సంక్రాంతి సమయంలో బాలకృష్ణ, చిరంజీవిలు నటించిన సినిమాలు చాలా విడుదలయ్యాయి. ఆ సినిమాలేంటి…. ఏ సంక్రాంతికి ఎవరి సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయో చూద్దాం
ఆత్మబలం (బాలకృష్ణ) – చట్టంతో పోరాటం (చిరంజీవి):
1985 సంక్రాంతి పండుగ సందర్భంలో బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు మొదటిసారిగా విడుదలయ్యాయి. బాలయ్య ఆత్మబలం నిరాశ పర్చగా చట్టంతో పోరాటం పర్వాలేదనిపించింది.
భార్గవ రాముడు (బాలకృష్ణ) – దొంగ మొగుడు (చిరంజీవి):
Advertisements
1987 సంక్రాంతి…. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ భార్గవరాముడు, అదే డైరెక్టర్ తో చిరంజీవితో దొంగమొగుడు సినిమాలను తీశారు. ఈ సంక్రాతిలో చిరంజీవి సినిమా హిట్ కాగా భార్గవ రాముడు యావరేజ్ సినిమాగా నిలిచింది.
ఇన్ స్పెక్టర్ ప్రతాప్ (బాలకృష్ణ) – మంచిదొంగ (చిరంజీవి):
1988 సంక్రాంతి…… చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావ్ డైరెక్షన్ లో మంచిదొంగ, బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో ఇన్ స్పెక్టర్ ప్రతాప్ లు రిలీజ్ అయ్యాయి. చిరు సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోగా కథలో దమ్మున్నప్పటికీ బాలయ్య సినిమా నిరాశపర్చింది.
పెద్దన్నయ్య (బాలకృష్ణ) – హిట్లర్ (చిరంజీవి):
1997 సంక్రాంతి…… ఇద్దరు హీరోలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్లు కొట్టారు. మాస్ ఆడియన్స్ పెద్దన్నయ్య సినిమాను పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేయగా, పాటలతో హిట్లర్ మూవీ ఆకట్టుకుంది. పెద్దన్నయ్యలో బాలకృష్ణ డబుల్ రోల్ చేయగా….హిట్లర్ సినిమా మళయాలం నుండి తెలుగులోకి రిమేక్ చేయబడింది.
Advertisement
వంశోద్ధారకుడు (బాలకృష్ణ) – అన్నయ్య (చిరంజీవి):
2000 సంక్రాంతి….. శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ వంశోద్ధారకుడు తీయగా.. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో చిరు అన్నయ్య సినిమా తీశారు. అన్నయ్య హిట్ కాగా వంశోద్దారకుడు నిరాశపర్చింది.
నరసింహ నాయుడు (బాలకృష్ణ) – మృగరాజు (చిరంజీవి):
2001 సంక్రాంతి……. బి. గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా వచ్చిన నరసింహానాయుడు టాలీవుడ్ రికార్డులను తిరగ రాసి ఇండస్ట్రీ హిట్ సాధించగా దీనికి పోటీ గా వచ్చిన చిరు సినిమా మృగరాజు మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.
లక్ష్మీ నరసింహ (బాలకృష్ణ) – అంజి (చిరంజీవి):
2004 సంక్రాంతి….. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో బాలయ్య నటించిన చిత్ర లక్ష్మీనరసింహా ఈ సినిమా సూపర్ హిట్ కాగా, కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన చిరు అంజి చిత్రం మాత్రం ప్లాప్ గా నిలిచింది.
గౌతమి పుత్ర శాతకర్ణి (బాలకృష్ణ) – ఖైదీ నంబర్ 150 (చిరంజీవి):
2004 తర్వాత మళ్లీ 2017లో …. సంక్రాంతికి ఇద్దరి సినిమాలు రిలీజయ్యాయి. గౌతమీ పుత్రశాతాకర్ణిగా క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య, ఖైదీ నంబర్ 150 గా వివి వినాయక్ డైరెక్షన్ లో చిరు….ఇద్దరూ తమతమ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టారు.
Advertisements