Advertisement
ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపేవారెవరా అంటే ముందుగా వినిపించే పేరు సినిమావాళ్లు, క్రికెటర్లు.. ప్రజలకు నేరుగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తే..ఇక్కడ సినిమా పూర్తిగా మారిపోతుంది..సినిమాల్లో క్రేజ్ పాలిటిక్స్ లో అన్ని సంధర్బాల్లో,అందరి విషయాల్లో పనిచేయదు.. పాలిటిక్స్ అంటే అదో డిఫరెంట్ ప్రపంచం,అక్కడ చక్రం తిప్పాలంటే చరిష్మా ఉంటే సరిపోదు అని అనేకమార్లు నిరూపితమైంది. ఆ విధంగా సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా ప్రజాభిమానం పొందిన తెలుగు నటీనటులు ఎవరు?. పరాజయం పాలైనవారెవరూ.. రాజకీయాలనుండి వెనుదిరిగిన నటులెవరూ..
నందమూరి తారకరామారావు
తెలుగు రాష్ట్రపు పదవ ముఖ్యమంత్రి మరియు మొట్టమొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి.. సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చి రాజకీయాల్లో కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నటుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది నందమూరి తారకరామారావు మాత్రమే.. తెలుగుదేశం పార్టిని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.. ముఖ్యమంత్రిగా రామారావు చేపట్టిన కార్యక్రమాలు ,ప్రజలకు చేసిన సేవ ఇప్పటికి చిరస్మరణీయం.
చిరంజీవి
Advertisements
రామారావు తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయారు..ప్రజారాజ్యం పార్టిని స్థాపించి విఫలమై కాంగ్రేస్లో విలీనం చేశారు..తర్వాత కాంగ్రేస్ పార్టి తరపున ఎంపిగా మరియు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం బాధ్యతలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్
చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టి స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు..2019 ఎన్నికల్లో భీమవరం,గాజువక రెండు ప్రాంతాల నుండి ఎమ్మెల్యేగా పోటిచేసి రెండు చోట్లా ఓడిపోయాడు.. జనసేన పార్టి ఆ ఎన్నికల్లో ఒక సీట్ గెలుచుకోగలిగింది.
విజయశాంతి
డేరింగ్ అండ్ డాషింగ్ లేడిగా గుర్తింపు పొందిన విజయశాంతి రాజకీయాలపై ఆసక్తితో బిజెపిలో చేరి.. తర్వాత తల్లి తెలంగాణా అనే పార్టిని స్థాపించి దానిని తెలంగాణా రాష్ట్ర సమితిలో విలినం చేసింది.
Advertisement
జయప్రద
నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది జయప్రద. ఆ తర్వాత తెలుగు దేశము పార్టీ యొక్క ఉమన్ వింగ్ అధ్యక్షురాలైనది. 1996లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది.కొన్ని అనివార్య కారణాల వల్ల టిడిపికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరింది.
జయసుధ
సహజనటి జయసుధ తెలుగుతో పాటు తమిళం,కన్నడంలో కూడా గుర్తింపు పొందింది.. కాంగ్రేస్ పార్టిలో జాయిన్ 2009లో సికింద్రాబాద్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు..
రోజా
జయప్రదను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన మరోనటి రోజా..తొలుత తెలుగుదేశం పార్టి లో ప్రవేశించిన రోజా తర్వాత కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 శాసనసభ ఎన్నికలలోనగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయింది. 2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలిచింది.
మోహన్ బాబు
విలక్షణ నటుడు మోహన్ బాబు తెలుగుదేశం పార్టి ప్రారంభించిన తొలినాళ్లల్లో ఆ పార్టిలో చేరారు..ఊహించినంత గుర్తింపు రాకపోవడంతో రాజకీయాల నుండి సినిమాలవైపు వెనుదిరిగారు.
హరికృష్ణ
చిన్ననాటి నుండి సినిమాల్లో నటించిన నటుడు హరికృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించి తర్వాత అన్నా తెలుగుదేశం పార్టిని స్థాపించాడు.. తర్వాత పార్టిని క్లోజ్ చేసి తెలుగు దేశం తరపున రాజ్యసభకు ఎంపిగా ఎన్నికయ్యారు..చంద్రబాబు మంత్రిత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు.
కోటాశ్రీనివాసరావు
విలన్ క్యారెక్టర్స్ తో గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు బిజెపి పార్టి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు..99-2004 పీరియడ్లో విజయవాడ నుండి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.
బాలకృష్ణ
తెలుగుదేశం పార్టి తరపున హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
Advertisements