Advertisement
సివిల్స్ పరీక్షను తెలుగులో బ్రహ్మాండంగా రాసుకోవొచ్చు. 2016 సివిల్స్ పరీక్షలో 3 వ ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ తన పరీక్షను తెలుగులోనే రాశాడు. కాకపోతే ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కొద్దోగొప్పో అవసరముంటుంది. పూర్తిగా ఇంగ్లీష్ ను పక్కన పెడతానంటే కుదరనిపని.
పరీక్షా విధానం ఎలా ఉంటుంది- ఎక్కడ తెలుగులో రాసుకోవొచ్చు.
సివిల్స్ పరీక్ష మొత్తం మూడు అంచెల్లో ఉంటుంది.
1) ప్రిలిమ్స్ – ఇది ఆబ్జెక్టివ్ టైప్- ఇంగ్లీష్ , హిందీ భాషల్లోనే ఉంటుంది.
ఇది క్వాలిఫై అయితే నెక్ట్స్ మెయిన్స్ .
Advertisements
Advertisement
2) మెయిన్స్ – ప్రశ్నలు ఇంగ్లీష్ లోనే ఉన్నప్పటికీ….భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలో అయినా సమాధానాలు రాసుకోవొచ్చు. మెయిన్స్ లోని అన్ని పరీక్షలు ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది.
3) ఇంటర్వ్యూ .. మెయిన్స్ నుండి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూ కు పిలుస్తారు. ఇక్కడ కూడా ఏంచక్కా తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వొచ్చు.. కానీ ముందుగానే తెలపాల్సి ఉంటుంది. అప్పుడు బోర్డ్ మనకోసం ఓ ట్రాన్స్ లేటర్ ను ఏర్పాటు చేస్తుంది.
Advertisements
For More Info Click : HERE