Advertisement
బస్సులు, కార్లు, లారీలు, టూవీలర్లు.. ఇలా ఏ వాహనాలను తీసుకున్నా.. ఆఖరికి విమానం అయినా బ్రేకులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ ఒక్కో వాహనానికి బ్రేకులు ఒక్కో రకంగా ఉంటాయి. ఇక రైళ్లకు కూడా బ్రేకులు ఉంటాయి. అయితే అవి కూడా భిన్నంగా ఉంటాయి. మరి బ్రేకులను అప్లై చేసినప్పుడు రైళ్లలో ముందుగా ఇంజిన్‌కు బ్రేకులు పడతాయా ? లేదా వెనుక ఉండే బోగీలకు బ్రేకులు పడతాయా ? అని చాలా మందికి సందేహం ఉంటుంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
రైళ్లో రెండు రకాల బ్రేకులు ఉంటాయి. ఒక బ్రేక్ ద్వారా ఇంజిన్, బోగీలకు బ్రేకులు పడతాయి. ఇంకో బ్రేక్ ద్వారా కేవలం ఇంజిన్‌కే బ్రేకులు పడతాయి. ఈ క్రమంలో ఇంజిన్, బోగీలను నియంత్రించే బ్రేకులను ఎ9 అని, కేవలం ఇంజిన్‌ను మాత్రమే నియంత్రించే బ్రేకులను ఎస్ఎ9 అని పిలుస్తారు. అయితే రైలుకు బ్రేకులు వేయాలంటే ముందుగా బోగీలకు బ్రేకులు వేయాలి. అలా కాకుండా ఇంజిన్‌కు బ్రేకులు వేస్తే అది బోగీల కన్నా త్వరగా ఆగుతుంది కనుక వెనుక ఉన్న బోగీలు ముందుకు దూసుకువచ్చి ఒకదానిపై ఒకటి పడి ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఇంజిన్, బోగీలను నియంత్రించే బ్రేకులను వేస్తారు.
Advertisement
Advertisements
అయితే ఇంజిన్, బోగిలను నియంత్రించే బ్రేకులను వేసినప్పటికీ రైళ్లలో ఉండే స్పెషల్ పెడల్ స్విచ్ పీవీఈఎఫ్ ద్వారా కేవలం బోగీలకు మాత్రమే బ్రేకులు పడేలా చూస్తారు. దీని వల్ల బోగీలకు ముందుగా బ్రేకులు పడతాయి. తరువాత ఇంజిన్‌కు బ్రేకులు పడతాయి. దీంతో రైలు సురక్షితంగా ఆగుతుంది.
Advertisements
ఇక చిత్రంలో ఎ9, ఎస్ఎ9 బ్రేకులను గమనించవచ్చు. వాటి ద్వారానే రైలుకు బ్రేకులు వేస్తారు. అయితే విద్యుత్‌తో నడిచే రైళ్లలో రీజనరేటివ్, రియోస్టాటిక్ బ్రేకింగ్ వ్యవస్థలు ఉంటాయి. వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే డీజిల్ రైళ్లలో డైనమిక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా భిన్న రకాల రైళ్లలో వివిధ రకాల బ్రేకింగ్ సిస్టమ్‌లు ఉంటాయి. కానీ ముందుగా బోగీలకు బ్రేకులు వేశాకే ఇంజిన్‌కు బ్రేకులు వేస్తారు. లేదంటే ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంటుంది..!