Advertisement
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం అన్నారు జంధ్యాల.. తన సినిమాల్లో నవ్వుకి పెద్దపీట వేసిన వ్యక్తి.. సినిమా అంటే భయంకరమైన ఫైట్లు.. రసవత్తరమైన పాటలు.. రొమాంటిక్ సన్నివేశాలు..అన్ని ఉన్నా కూడా కామెడి లేకపోతే సినిమాలో ఏదో మిస్ అయింది అనిపిస్తూ ఉంటుంది..కామెడికి , కమెడియన్స్ కి ప్రత్యేక అభిమానులుంటారు… వాళ్ల నటనకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటూ, రిలాక్స్ అవుతూ ఉంటారు..
మన్మధుడు నాగార్జున విషయానికి వస్తే ఆయన పర్సులో బ్రహ్మానందం గారి ఫోటో ఉంటుందట.. ఎప్పుడైనా టెన్షన్ గా నిపించినా ఏదన్నా డిస్టర్బెన్స్లో ఉన్నా వెంటనే పర్సు తీసి బ్రహ్మానందంగారి ఫోటో చూసుకుని, ఆయన నటించిన ఫన్ని సన్నివేశాలని గుర్తు తెచ్చుకుని నవ్వుకుని రిలాక్స్ అవతారట…నాగ్ కే కాదు ఎందరికో తమ నవ్వుల్ని పంచిన కొందరు కమెడియన్స్ గురించి చెప్పుకుందాం..కామెడి జంటల గురించి
రేలంగి-గిరిజ:
1950,60 దశకాల్లో హీరో హీరోయిన్లతో సమానంగా పేరు సంపాదించుకున్న జంట రేలంగి,గిరిజ..వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.. ఏదైనా సినిమాలో ఈ జంట ఉందంటే ఇక నవ్వులకు లోటు లేదన్నట్లే..!అప్పుచేసిపప్పు కూడు,పెళ్లికానుక,ఇల్లరికం వీరు నటించిన సినిమాల్లో కొన్ని..
Advertisements
రాజబాబు- రమాప్రభ:
గిరాజారేలంగిల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన జంట రాజబాబు, రమాప్రభ.. హాస్యనటుడిగా రాజబాబుది తెలుగు సినిమాల్లో ప్రత్యేక స్థానం.. రాజబాబుకి రమాప్రభ జతకడితే నవ్వులే నవ్వులు..! ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి,
పద్మనాభం-గీతాంజలి:
తెలుగు సినిమాల్లో హస్య జంటల గురించి చెప్పుకోవాలంటే పద్మనాభం,గీతాంజలి పేర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే..
బ్రహ్మానందం- కోవై సరళ:
రేలంగి గిరిజ,రమాప్రభ,రాజబాబు ల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన జంట బ్రహ్మానందం- కోవై సరళ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో ..సినిమా హిట్ తో సంబంధం లేకుండా వీరి కామెడిని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు..మరీ ముఖ్యంగా క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో మెయిన్ రోల్స్ కంటే ఈ జంట కామెడికే ఎక్కువ మార్కులు పడ్డాయి.
Advertisement
కోటా శ్రీనివాసరావు- బ్రహ్మానందం:
అహా నా పెళ్లంట సినిమాతో మొదలైన ప్రస్థానం కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందంలది.. భయంకరమైన విలనిజాన్ని పండించగల కోటాశ్రీనివాసరావుగారిలో కామెడి యాంగిల్ కూడా బీభత్సంగా ఉంది.. బ్రహ్మానందంతో కలిస్తే ఇక మన పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
సూర్యాకాంతం- ఛాయదేవి:
సూర్యాకాంతం,ఛాయాదేవి ఇద్దరూ ఇద్దరే..వీరిద్దరూ కలిస్తే నవ్వులే నవ్వులు.. వీరిద్దరూ భయంకరంగా తిట్టుకుంటున్నా మనకి మాత్రం ఫుల్ కామెడి..!
రమణరెడ్డి-రేలంగి:
రేలంగి, రమణరెడ్డి కాంబినేషన్లో వచ్చిన కామెడి సీన్స్ కూడా సూపర్ హిట్..
సుత్తివీరభద్రరావు-సుత్తివేలు:
జంధ్యాల సినిమాలతో పరిచయమైన అన్నదమ్ములు సుత్తివీరభద్రారావు, సుత్తివేలు.. జంధ్యాల సినిమాల్లో వీరిద్దరూ పండించిన కామెడి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే..రెండు జళ్ల సీత,వివాహ భోజనంబు వీరిద్దరు నటించిన సినిమాల్లో కొన్ని..
రావు గోపాల రావు-అల్లు రామలింగయ్య:
లెజెండరీ యాక్టర్ రావుగోపాలరావుది విలక్షణ శైలి..వాయిస్ వింటే చాలు గజ్జున వణికిపోతుంటాం.. అటువంటి విలన్ కూడా అల్లు రామలింగయ్య పక్కనుంటే మాత్రం నవ్వుకునేలా చేస్తారు..
కోటా శ్రీనివాసరావు-బాబుమోహన్:
బ్రహ్మానందం తర్వాత కోటా, బాబు మోహన్ కాంబినేషన్లో వచ్చిన కామెడి సీన్స్ చాలా ఫన్నిగా ఉండేవి.. విలన్ రోల్ లో కోటా గారు,ఆ యన దగ్గర అసిస్టెంట్ గా బాబుమోహన్ ఒకవైపు భయానకం,మరోవైపు కామెడి రెండింటిని సమపాళ్లల్లో అందించేవారు.
Advertisements