Advertisement
కొత్తదనానికి మన తెలుగు వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు.ఆ చిట్కాను పసిగట్టిన సంస్థలు,హీరోలు మన తెలుగింటి వారు అయిపోయారు. మరి అలాంటి కొత్తదనాన్ని ప్రతి విషయంలో ఎంకరేజ్ చేసే మన తెలుగు స్టార్స్ తాజాగా తమ సహా నటుల పుట్టినరోజులకి కామన్ డీపీ లను విడుదల చేస్తున్నారు.అలాగే ఆ ఫోటోలను బాగా వైరల్ చేస్తున్నారు ఇంతకీ ఆ స్టార్స్ ఎవరో వాళ్ళ కథేంటో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ ( 22 August) : టాలీవుడ్ డ్యాన్స్ లు,ఫైట్ లను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.ఇప్పుడు తెలుగు లో ఉన్న చాలామంది నటులకు ఈయనే ఇన్స్పిరేషన్. అలాంటి మెగాస్టార్ పుట్టినరోజుకి రామ్ చరణ్ కామన్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.దీన్ని సుమారు 100 మంది సెలబ్రిటీలు తమ ఖాతాలలో పోస్ట్ చేసి మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
NTR (20 May) : అతి చిన్న వయసులో హీరోగా వెండితెర పైన మెరిసిన ఎన్టీఆర్.అతి తక్కువ టైంలో ఎవరూ ఊహించనంత పెద్ద స్టార్ అయ్యారు.ఈయనను టాలీవుడ్ ప్రముఖులు కంప్లీట్ యాక్టర్ గా అభివర్ణిస్తుంటారు.మరి అలాంటి మన ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ మరియు ఇతర టాలీవుడ్ ప్రముఖులు కామన్ డిపిని ఒకేసారి పోస్ట్ చేసి తారక్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.
Advertisements
Advertisement
నాగార్జున ( 29 August ) : ఈ తరంలో కూడా ఎంతో మంది అమ్మాయిల మదిలో గ్రీకువీరుడుగా, మన్మధుడిగా నిలిచిన నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని కోడలు సమంత కామన్ డిపిని విడుదల చేసింది.ఇందులో నాగార్జున నటించిన అన్ని పాత్రలు దర్శనమిచ్చాయి.మామ పుట్టినరోజు కోసం అక్కినేని ఫ్యాన్స్ కు సమంతా ఇచ్చిన గిఫ్ట్ మెమరబుల్ గా మిగిలింది.
బాలయ్య: ( 10 June ) పౌరాణిక పాత్రలకైనా , యాక్షన్ సినిమాలకైనా బాలయ్యబాబు పెట్టింది పేరు! తండ్రి నుండి నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న బాలయ్య….తన నటనతో పవర్ ఫుల్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.!
మహేష్ బాబు ( 9 August ) :
ప్రిన్స్ …. సినిమా సినిమాలో వైవిధ్యం! స్టార్ ఇమేజ్ ను సైతం పక్కకు పెట్టి నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోవడం ఇది ప్రిన్స్ మహేష్ నైజం!
Advertisements