Advertisement
1962 చైనాతో జరిగిన యుద్దంలో ఇండియా ఓడిపోయింది. దీంతో అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్ర నిరాశతో ఉన్నాడు. స్వాతంత్రోద్యమం నుండి ఆయనకు మంచి స్నేహితుడైన కామరాజు నెహ్రూను పలకరించడానికి వచ్చాడు. ఈ సందర్భంలో వారిద్దరి మద్య జరిగిన సంభాషణ ఇది.
- కామరాజ్: మన ఓటమికి కారణం ఏమిటి?
- నెహ్రూ: చైనాను ఎదుర్కొనేలా మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు లేవు ” అని నెహ్రూ అన్నారు.
- కామరాజ్ : ” మరి ఆయుధాలు కొనుగోలు చేసి ఉండొచ్చు కదా.! .
- నెహ్రూ: “ మేము ఇప్పటికే అమెరికా నుండి ఆయుధాలు కొన్నాము, కానీ షిప్పింగ్‌లో ఒక సమస్య ఉంది”.
- కామరాజ్: ”ఏమిటా సమస్య?”
- నెహ్రూ : ”అమెరికన్ చట్టాల ప్రకారం, ఒక అమెరికన్ బ్యాంక్ మన ప్రభుత్వానికి హామీ ఇస్తేనే ఆయుధాలు మన దేశానికి దిగుమతి అవుతాయి. కానీ మన ప్రభుత్వానికి హామీ ఇవ్వడానికి ఏ అమెరికన్ బ్యాంక్ సిద్దంగా లేదు.
- కామరాజ్:“భారతదేశంలో ఏదైనా అమెరికన్ బ్యాంక్ ఉందా?”
- నెహ్రూ: “అవును, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ అనే పేరుతో అమెరికన్ బ్యాంక్ మన ఇండియాలో ఒకటి ఉంది.
- కామరాజ్: ”ఆ బ్యాంకును మూసివేయండి” అన్నాడు.
- నెహ్రూ: మనం ఆ బ్యాంకును మూసివేస్తే అది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది”
- కామరాజ్: ”మనల్ని నమ్మని దేశానికి మనమెందుకు మద్దత్తివ్వాలి”?
నెహ్రూ ఆ బ్యాంకును మూసివేసాడు.దీంతో షాక్ తిన్న అమెరికా తన తప్పును తెలుసుకొని ఆయుధాలను ఇండియాకు దిగుమతి చేసేందుకు ఒప్పుకుంది.
Advertisement
ఇక్కడ కామరాజు గారి గురించి తెల్సుకోవాల్సిన అవసరముంది. చిన్ననాడే తండ్రి మరణంతో తన ప్రాథమిక విద్యను మధ్యలోనే వదిలేసిన కామరాజు గారు అంచెలంచెలుగా ఎదిగారు. స్వాతంత్రోద్యమంలో వీరోచిత పోరాటం చేశారు. తన పర్సనాలిటీకి తగ్గట్టే తన నిర్ణయాలు కూడా గంభీరంగా ఉండేవి.! తమిళనాడు రూపు రేఖలను మార్చిన నాయకుడు కామరాజు.
Advertisements
నెహ్రూ తర్వాత ప్రధాని అయ్యే అన్ని అవకాశాలున్నప్పటికీ నార్త్ ఇండియా డ్యామినేషన్ కారణంగా సౌత్ ఇండియన్ అయిన కామరాజుకు ఆ పదవి దక్కలేదని అంటారు. కామరాజు కు హిందీ, ఇంగ్లీష్ భాషలు స్పష్టంగా రావనే కారణంతోనే అతనికి ప్రధాని పదవి దక్కలేదనే ప్రచారం కూడా ఉంది.
Advertisements