Advertisement
చైనాలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ నుండి ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనాకు మందు కనిపెట్టినట్టుగా ప్రకటించింది ఇండియన్ ఫార్మా కంపెనీ Glenmark.! మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా సక్సెస్ ఫుల్ గా చేశామని తెలిపింది గ్లెన్ మార్క్ కంపెనీ.!
కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారిపై …. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తమ రీసెర్చ్ లో తేలిందని….వాటి కాంబినేషన్ లోనే మెడిసిన్ ను తయారు చేశామని దానినే ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే Drugs Controller General of India (DCGI) నుంచి అనుమతి కూడా పొందినట్టు తెలిపారు.
Advertisement
వైద్యుల ప్రిస్క్రిప్షన్ మీదనే విక్రయించే…. ఈ ఫాబిఫ్లూ ట్యాబ్లెట్ ధర 103 రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది.
స్వల్ప, మధ్యస్థ కరోనా లక్షణాలు ఉన్నవారు 1800 mg టాబ్లెట్లను మొదటి రోజు రెండు సార్లు … ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 mg టాబ్లెట్లను రోజుకు రెండుసార్లు వాడాలని సూచించింది. ఇలా వేసుకుంటే నాలుగు రోజుల్లోనే వైరల్ నియంత్రణలోకి వస్తుందట! షుగర్ , హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్లు కూడా వీటిని వాడొచ్చట.!
Advertisements
Advertisements