Advertisement
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవలే భారత్‌లో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబర్ 23న ఈ స్టోర్‌ను యాపిల్ లాంచ్ చేసింది. అయితే ఈ స్టోర్‌లో వినియోగదారులు నేరుగా యాపిల్ నుంచే తమకు కావల్సిన ఏ యాపిల్ ప్రొడక్ట్ ను అయినా కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఐపాడ్స్, మాక్ బుక్ ప్రొలు, యాపిల్ వాచ్‌లు.. ఇలా ఒకటేమిటి.. ఏ యాపిల్ ప్రొడక్ట్ కావాలన్నా యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తుంది. అయితే ఈ స్టోర్‌లో ఉన్న అత్యంత ఖరీదైన యాపిల్ ప్రొడక్ట్ ఏమిటో కొందరు చెప్పేశారు. అదేమిటంటే…
యాపిల్‌కు చెందిన మాక్ ప్రొ లను సహజంగానే ప్రొఫెషనల్స్ వాడుతుంటారు. దీన్ని ఎక్కువగా గ్రాఫిక్స్ కోసం వాడుతారు. ఆ పనికి ఇవి చక్కగా పనిచేస్తాయి. అనేక మంది మాక్ ప్రొలను గ్రాఫిక్స్ పనుల కోసం కొంటారు. అయితే మాక్ ప్రొలను మనకు నచ్చిన కాన్ఫిగరేషన్‌తో కొనే వెసులుబాటును యాపిల్ తన ఆన్‌లైన్ స్టోర్‌లో కల్పించింది. ఇప్పటికే పలు ఇతర దేశాలకు చెందిన యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లలో మాక్ ప్రొలను తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ తో కొనే సౌకర్యం అందిస్తున్నారు. ఇదే సౌకర్యాన్ని యాపిల్ ప్రస్తుతం తన ఆన్‌లైన్ స్టోర్ ద్వారా భారత వినియోగదారులకు అందిస్తోంది. ఈ క్రమంలో మాక్ ప్రొకు గాను అత్యంత భారీ కాన్ఫిగరేషన్‌ను సెట్ చేస్తే దాని ధర రూ.53,02,800గా తేలింది.
Advertisement
మరొక యూజర్ కూడా మాక్ ప్రొను కొనేందుకు హై కాన్ఫిగరేషన్ సెట్ చేసి దాని ఉజ్జాయింపు ధరను లెక్కించాడు. దీంతో ఆ యూజర్‌కు మాక్ ప్రొ ధర రూ.59,33,500గా వచ్చింది. ఈ క్రమంలో యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో అత్యంత ఖరీదైన ప్రొడక్ట్ గా మాక్ ప్రొ నిలిచింది. అయినప్పటికీ దీన్ని ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. ప్రాసెసర్ స్పీడ్‌ను ఇంకా పెంచితే మరో రూ.1 లక్ష అదనంగా ఖర్చవుతుంది. అంటే ఒక్క హై కాన్ఫిగరేషన్ మాక్ ప్రొ ధర రూ.60 లక్షలన్నమాట. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఈ విషయంపై సెటైర్లు వేస్తున్నారు.
Advertisements
I can get a Mac Pro (everything max with steel framed wheels and pro stand) now at just ₹60 lakhs. Sweet! #AppleStoreindia #appleindia pic.twitter.com/5lPO5lnUGp
— Praveen Nag (@prvee_n) September 23, 2020
I'm confused which one should I buy ?#AppleStoreIndia #LandRover pic.twitter.com/Txvr9WjbJq
— StufflistingsArmy (@skyseven2602) September 23, 2020
Advertisements
సాధారణంగా ఒక డాలర్‌కు 73 రూపాయలు కానీ.. యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో 1 డాలర్‌కు రూ.100 ఖర్చు పెడుతున్నట్లు ఉందని ఒక యూజర్ కామెంట్ చేయగా, రూ.60 లక్షలతో ఏకంగా ఒక రేంజ్ రోవర్ కారే వస్తుందని మరొక యూజర్ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై కొందరు జోకులు కూడా పేలస్తున్నారు. తమ బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే మైనస్‌లో ఉందని, కనుక ఈ న్యూస్ తమకు అవసరం లేదని అంటున్నారు. ఏది ఏమైనా.. యాపిల్ ప్రొడక్ట్స్ ధరలు మాత్రం నిజంగా ఇలాగే కళ్లు బైర్లుగమ్మే స్థాయిలో ఉంటాయి.