Advertisement
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించుకున్నారనే కారణంతో ఓ జంట పట్ల స్థానికులు దారుణంగా ప్రవర్తించారు. 12 మంది కలిసి వారి మెడలో చెప్పుల దండ వేసి తమ గ్రామంలో వారిని ఊరేగించారు. కుషీనగర్‌లోని హటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
హటా అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళ, వ్యక్తి ప్రేమించుకున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. ఈ క్రమంలో తాజాగా ఒక రోజు ఆ వ్యక్తి ఆ మహిళను రాత్రి పూట కలిశాడు. దీంతో ఆ మహిళ తరఫు కుటుంబ సభ్యులు ఇద్దరినీ పట్టుకుని బంధించారు. అనంతరం వారి ముఖాలకు నలుపు రంగు పూసి, వారి మెడల్లో చెప్పుల దండలు వేసి గ్రామంలో వీధుల వెంబడి తిప్పించారు.
కాగా ఈ ఘటనకు అక్కడి సభాసద్ (వార్డు మెంబర్) కారణమయ్యాడని పోలీసులు తెలిపారు. అతనితో కలిపి మొత్తం 12 మంది ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి ఎస్‌పీ వినోద్ కుమార్ తెలిపారు.
Advertisements