Advertisement
“కోవిడ్-19” బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది..లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు రోజువారి పనుల్లో పడ్డారు..కానీ ప్రతి ఒక్కరిని కరోనా అటాక్ చేస్తుందేమో అనే భయం వెంటాడుతుంది..ప్రభుత్వాలు కరోనా లక్షణాలుంటే తప్ప హాస్పిటల్స్ కి రావొద్దు అని తేల్చిచెప్పేసింది..ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా ఇప్పుడు కోవిడ్ టెస్టులు చేయడానికి అనుమతి లభించడంతో బారిగా డిమాండ్ పెరిగిపోయింది..
ఈ నేపధ్యంలో ఇంట్లోనే సింపుల్ గా కోవిడ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తూ ,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరిస్తూ డాక్టర్ సంధ్యారామనాధన్ ఒక వీడియో విడుదల చేశారు..న్యూజిలాండ్ లో స్థిరపడిన డా.సంధ్యారామనాధన్ చెప్పిన ఆ జాగ్రత్తలేంటంటే..
ఇంట్లోనే టెస్ట్ చేసుకోండిలా…
శరీరంలోకి కరోనా ప్రవేశించినట్టైతే మొదట మన శరీరంలో ఆక్సిజన్ రేటు తగ్గుతుందని అన్నారు సంధ్య..మరి మనకు కరోనా సోకిందా లేదా? శరీరంలో ఆక్సిజన్ రేటు తెలుసుకోవడం ఎలా?? అన్న విషయాన్ని గుర్తించడానికి హాస్పిటల్ వరకు వెళ్లక్కర్లేదు ఇంట్లోనే గుర్తించవచ్చని చెబుతున్నారు డా.సంధ్య.. అందుకు మీకు కావలసింది “పల్స్ ఆక్సిమీటర్”. అన్ని చోట్లా దొరికే ఈ మిషన్ ను చూపుడు వేలుకు తగిలిస్తే, శరీరంలో ఆక్సిజన్ ఏ మేరకు సరఫరా అవుతుందన్న విషయాన్ని వెల్లడిస్తుంది. మీటర్ రీడింగ్ 95 నుంచి 100 మధ్యలో ఉండాలని, 93 కన్నా తక్కువగా చూపిస్తే మాత్రం డాక్టర్ ను సంప్రదించాలని అన్నారు.
Advertisement
Advertisements
రెండు బెలూన్ల సాయంతోనూ..
రెండు బెలూన్ల సాయంతోనూ మీలోకి వైరస్ ప్రవేశించింది లేనిది తెలుసుకోవచ్చని వివరించారు..దీనికోసం మీరు చేయాల్సంది రెండు పెద్ద బెలూన్లు తీసుకుని, వాటిలోకి గాలిని ఊదడం ద్వారా ఎంత వేగంగా గాలిని వదులుతున్నారు? శ్వాసను ఎంతవరకూ ఆపగలుగుతున్నారన్న విషయాలను తెలుసుకోవచ్చని, శరీరంలో వైరస్ ఉంటే, ఊపిరిని ఎక్కువసేపు నిలిపి ఉంచలేరట..
ఇమ్యునిటి పవరే శ్రీరామరక్ష…
శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నప్పుడే మాత్రమే వైరస్ ని ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది.ఇందుకోసం న జింక్, విటమిన్ డి,సి ఉండే పండ్లను తీసుకోవాలని, సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు.
వైరస్ సోకితే..
వైరస్ సోకితే తరచూ వేడి నీళ్లతో పుక్కిలిస్తూ ఉండాలని, నాజల్ స్ప్రేను వినియోగించాలని సంధ్య సలహా ఇచ్చారు. కరోనా సోకితే, వైరస్ ఊపిరితిత్తుల గోడల్లోని చివరి భాగాన అతుక్కుని ఉంటుందని, దానిని బయటకు పంపేందుకు శ్వాస వ్యాయామాలు చేయాలని, అప్పుడే వైరస్ నుంచి త్వరగా కోలుకోవచ్చని అన్నారు డా. సంధ్యా రామనాధన్..
Watch Video:
Advertisements