Advertisement
సెంటిమెంట్స్…..వీటిని అన్ని రంగాల వాళ్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినీ, క్రీడా రంగాల్లో వీటిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. క్రికెటర్స్ లో సెంటిమెంట్లను బలంగా నమ్మేవారు ఎవరు? వారు ఎలాంటి సెంటిమెంట్స్ ను నమ్ముతారో ఇప్పుడు చూద్దాం!
1.సచిన్ టెండూల్కర్:
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే సమయంలో …..మొదట తన లెప్ట్ లెగ్ ప్యాడ్ కట్టుకుంటాడు…ఇలా చేస్తే తన టీమ్ గెలుస్తుందని అతని నమ్మకం!
2.విరాట్ కోహ్లీ:
Advertisements
కోహ్లీ మొదట్లో ఒకసారి బాగా స్కోర్ చేసినప్పుడు తన చేతికి వేసుకున్న గ్లౌజ్ లను లక్కీ గ్లౌజ్ లుగా భావించి…తర్వాత ప్రతిసారి వాటినే వాడేవాడట! తర్వాతి కొన్ని రోజులకు తను ఆ సెంటిమెంట్ ను వదిలేశాడు.
3. యువరాజ్ సింగ్:
యువరాజ్ సింగ్ పుట్టినరోజు డిసెంబర్ 12 అందుకే తాను 12 నెంబర్ ని తన లక్కీ నెంబర్ గా భావిస్తాడు . అందుకే తన జెర్సీ పై కూడా అదే నెంబర్ ఉంటుంది , అలాగే ఇతని చేతికి నల్లదారం కూడా కట్టుకుంటాడు…అది అతని సెంటిమెంట్!
4 అశ్విన్:
అశ్విన్ తన బ్యాగ్ ని అదృష్టంగా భావిస్తాడట . ఆ బ్యాగ్ తనకు మాత్రమే కాదు టోటల్ టీమ్ కు అదృష్టంగా భావిస్తాడు.
5.సౌరవ్ గంగూలీ:
గంగూలీ దైవభక్తి ఎక్కువ…..అందుకే అతని జేబులో గురువు ఫోటో పెట్టుకుంటాడు.! అలాగే అతని చేతికి ఉంగరాలు , మెడలో మాలలు కూడా ఉంటాయి .
Advertisement
6. MS ధోని :
ధోని తన పుట్టినరోజు జులై 07 కావడం, తనకిష్టమైన ఫుట్ బాల్ ప్లేయర్ జెర్సీ నెంబర్ కూడా 07 కావడంతో….అదే నెంబర్ ను తన లక్కీ నెంబర్ గా భావిస్తాడు .అందుకే అతని జెర్సీ పై 7 ఉంటుంది.
7.జహీర్ ఖాన్ :
జహీర్ ఖాన్ పసుపు రంగు కర్చీఫ్ ని తన అదృష్టంగా భావిస్తాడు.
8. వీరేంద్ర సెహ్వాగ్:
సెహ్వాగ్ మొదట్లో 44 నెంబర్ ఉన్న జెర్సీ ని వేసుకునేవాడు . కానీ అది తనకి అంతగా కలిసిరాకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం… నెంబర్ లేని జర్సీ ని వేసుకునేవాడు.
9. అజహారుద్దీన్:
అజర్ మెడలో నల్లని తావీజ్ ఉండేది.దాన్నే అతను సెంటిమెంట్ గా భావించేవాడు.
10.మోహిందర్ అమర్నాథ్:
అమర్నాథ్ ఎర్రని కర్చీఫ్ ను ఎప్పుడూ తన జేబులో ఉంచుకునేవాడు! అతను 1983 లో వరల్డ్ కప్ మ్యాచ్ లో చివరి వికెట్ తీసి ఇండియాకు కప్ అందించాడు .
Advertisements