Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక‌….వీళ్లు ఏం చేస్తున్నారు తెలుసా? క్యాబ్ డ్రైవ‌ర్ గా ఒక‌రు, దేశ ప్ర‌ధానిగా ఒక‌రు…..

Advertisement

క్రికెట్ అంటేనే ఇప్పుడు కాసుల క్రీడ‌! కానీ ఒక‌ప్పుడు ప‌రిస్థితులు ఇలా కాదు…ఆడినంత సేపు ఓకే కానీ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే టీమ్ లో నుండి ఔటే.! త‌ర్వాత ఇటు క్రికెట్ ఆడ‌లేక అటు వేరే ప‌ని చేసుకోలేక లైఫ్ ను లీడ్ చేయ‌డంలో తెగ ఇబ్బంది ప‌డిన వారు అనేక మందున్నారు!

మ‌న‌కు తెల్సిన కొంతమంది క్రికెటర్స్ …క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం!

బ్రెట్ లీ : ఆస్ట్రేలియా తరపున 690 వికెట్లు తీసిన బ్రెట్ లీ, ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాడు. అలాగే బాలీవుడ్ లో నిర్మిస్తున్న అన్ఇండియన్ అనే సినిమాతో యాక్టింగ్ లో కూడా అడుగుపెడుతున్నాడు.

ఆండ్రూ ఫ్లింటాఫ్ : ఇంగ్లాండ్ తరపున అన్ని ఫార్మాట్ లలో కలిపి 400 వికెట్లు తీసి గొప్ప ఆల్ రౌండర్ గా పేరు పొందిన ఫ్లింటాఫ్, క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక కిక్ బాక్సింగ్ లో చేరాడు. అతను ఆడిన మొదటి మ్యాచ్ లొనే అమెరికా కు చెందిన రిచర్డ్ డాసన్ ను ఓడించాడు.

Advertisements

అర్షద్ ఖాన్ : పాకిస్థాన్ కు చెందిన అర్షద్ ఖాన్ రైట్ హాండ్ బ్యాట్సమెన్. తను ఆడిన మొదటి మ్యాచ్ నుండే మంచి క్రికెటర్ గా పేరు పొందిన ఆర్షద్, తరువాత జట్టులో చోటు కోల్పోయి సిడ్నీ వెళ్ళిపోయి క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అయ్యాడు.

Advertisement

క్రిస్ హారిస్ : న్యూజిలాండ్ కు చెందిన హారిస్ మంచి ఆల్ రౌండర్ గా తన సేవలను అందించాడు. రిటైర్మెంట్ తరువాత హారిస్ ఒక ఆర్థోపెడిక్ కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.

ఇమ్రాన్ ఖాన్ : పాకిస్థాన్ 1992 లో వరల్డ్ కప్ గెలవడం లో ఎంతో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ ఖాన్ తన రిటైర్మెంట్ తరువాత పాకిస్థాన్ కు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు.

ఓలంగా : జింబాబ్వే ఫాస్ట్ బౌల‌ర్ ఓలంగా… రిటైర్మెంట్ అయ్యాక ఓ రియాలిటీ షోకి సింగ‌ర్ గా వెళ్లి….ఆ షోలో విజేత‌గా నిలిచాడు.

సిద్దూ : డ‌్యాషింగ్ బ్యాట్స్ మ‌న్ గా పేరుగాంచిన సిద్దూ రిటైర్మెంట్ త‌ర్వాత కామెంటేట‌ర్ గా త‌ర్వాత కామెడీ షోకి జ‌డ్జ్ గా…అటు త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు.

ఇంకా అనేక మంది మాజీ ఇండియ‌న్ క్రికెట్ టీమ్ స‌భ్యులు…ఐపియ‌ల్లో వివిధ జ‌ట్ల‌కు స‌పోర్టింగ్ స్టాఫ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు…రికీ పాంటింగ్, మ‌హేల జ‌య‌వ‌ర్థ‌నే, జ‌హీర్ ఖాన్, రాబిన్ సింగ్ , కైఫ్……ఇలా చాలా మంది మ‌న‌కు ఐపియ‌ల్ లో క‌నిపిస్తున్నారు.

రిటైర్ అయ్యాక క్రికెట‌ర్స్ ఎక్కువ‌గా ఎంచుకునే ఫీల్డ్స్.!

Advertisements

1. పిచ్ క్యూరేట‌ర్స్ & స‌పోర్టింగ్ స్టాఫ్
2. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ టీమ్స్ కి కోచ్ లుగా….
3. ఎంపైర్స్ గా.