Advertisement
మన టాలీవుడ్ నటులు నటనలోనే కాదు క్రికెట్ లో కూడా దుమ్ముదులుపుతారు.! కొంతమంది నటులు ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని బ్యాటింగ్ , బౌలింగ్ చేస్తారు. ఇందులో మొదట్లో క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యి తర్వాత రూట్ మార్చి యాక్టింగ్ లోకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. CCL (సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ ) కారణంగా వాళ్ల టాలెంట్ బయటపడుతుంది. మన తెలుగులో క్రికెట్ బాగా ఆడే యాక్టర్స్ ఎవరో చూద్దాం!
1. అక్కినేని అఖిల్:
సిసింద్రీ సన్ ఆఫ్ నాగార్జున….. క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యి ఆస్ట్రేలియాలో కోచింగ్ తీసుకున్న అఖిత్ తర్వాత యాక్టింగ్ కి షిప్ట్ అయ్యాడు.! CCL- 2010 లో మ్యాన్ ఆఫ్ ది సీరిస్ ను గెలుచుకున్నాడు. అతని కెప్టెన్సీ లో తెలుగు టీమ్ 2015 , 2016 , 2017 CCL విన్నర్స్ గా నిలిచింది.
2. సచిన్ జోషి:
Advertisements
మౌనమేలనోయి, ఒరేయ్ పండు , నీ జతగా నేనుండాలి సినిమాలలో హీరోగా చేసిన . సచిన్ జోషి తెలుగు వాడు కానప్పటికీ టాలీవుడ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి . ఇక సచిన్ జోషి తెలుగు వారియర్స్ టీమ్ లో డ్యాషింగ్ ఓపెనర్! మంచి క్లాసిక్ షాట్స్ తో బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడు.
3.సాయి ధరమ్ తేజ్:
సాయి ధరమ్ తేజ్ కూడా క్రికెట్ ను కెరీర్ గా సెలెక్ట్ చేసుకొని తర్వాత ట్రాక్ చేంజ్ చేశాడు. 2015 , 2016 CCL ఎడిషన్ లో తెలుగు వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు!
4. అశ్విన్:
ఓంకార్ తమ్ముడు అశ్విన్ , రాజు గారి గది , నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ లాంటి కొన్ని సినిమాలలో కూడా హీరోగా నటించాడు. ఇతను కూడా మంచి బ్యాట్స్ మెన్.
5. తరుణ్:
Advertisement
తరుణ్ సినిమాల్లోకి రాకముందు రంజీ మ్యాచ్ ల్లో ఆడాడు. సినిమా ఫీల్డ్ కు వచ్చాక క్రికెట్ ను పూర్తిగా తగ్గించాడు. మంచి బ్యాట్స్ మెన్ !
6. ప్రిన్స్:
బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ ప్రిన్స్ కూడా మంచి బ్యాట్స్ మెన్.! సచిన్ తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. తెలుగు వారియర్స్ గెలుపులో చాలా సార్లు కీలక పాత్ర పోషించాడు.
7. సుధీర్ బాబు:
సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ సహాచరుడిగా అనేక బ్యాట్మింటన్ టోర్నమెంట్లు ఆడాడు. నేషనల్ లెవల్ బ్యాట్మింటన్ ప్లేయర్ అయిన సుదీర్ బాబు క్రికెట్ కూడా బాగా ఆడతాడు!
8. వెంకటేష్:
ఆటపరంగా అంతగా ఆడకున్నా…..క్రికెట్ అంటే పడిచచ్చే రకం వెంకటేష్! ఎక్కడ మ్యాచ్ జరిగినా కనీసం ఒక్క మ్యాచ్ నైనా లైవ్ లో చూసే ప్రయత్నం చేస్తాడు వెంకీ…ఇక తెలుగు వారియర్స్ ఆడే మ్యాచెస్ లో డగౌట్ లో ఉంటూ యువకుల్లో హుషారు నింపుతుంటాడు.
9. నిఖిల్:
హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నిఖిల్ కూడా మంచి క్రికెట్ ప్లేయరే.
10. నితిన్:
నితిన్ కూడా మంచి బ్యాట్స్ మెన్ !
Advertisements