Advertisement
ఆంఫన్ తుఫాన్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్‌లను అల్లాడిస్తోంది. ఇక అంతకు ముందు తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు కూడా వచ్చాయి. అయితే ఏ తుఫాన్ వచ్చినప్పుడు అయినా సరే.. అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తుంటారు. ఒకటో నెంబర్, రెండో నంబర్.. అంటూ ప్రమాద హెచ్చరికలను ప్రకటిస్తారు. అయితే ఏ హెచ్చరికలో ఏం సందేశాలుంటాయి..? ఏ హెచ్చరిక మనకు ఏం సమాచారాన్ని తెలుపుతుంది ? ఏ హెచ్చరికను ఎప్పుడు జారీ చేస్తారు ? అంటే…
భారత వాతావరణ శాఖ ( IMD ) రాష్ట్ర ప్రభుత్వాలకు 4 దశల్లో తుఫాన్ హెచ్చరికలను జారీ చేస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రజలను హెచ్చరించాలి. తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి.
మొదటి దశ హెచ్చరిక:
తీరప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా మారడానికి 72 గంటల ముందు ఈ హెచ్చరికను జారీ చేస్తారు. తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చనే సమాచారం ఈ హెచ్చరికలో ఉంటుంది.
Advertisement
రెండో దశ హెచ్చరిక:
తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడేందుకు కనీసం 48 గంటల ముందు ఈ హెచ్చరికను జారీ చేస్తారు. తుఫాను కదలిక, తీవ్రత, ఏయే తీర ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉండవచ్చు అంనే అంశాలను తెలుపుతారు.
Advertisements
Advertisements
మూడో దశ హెచ్చరిక:
తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడేందుకు కనీసం 24 గంటల ముందు ఈ హెచ్చరికను జారీ చేస్తారు.తుఫాను కదలిక, దాని తీవ్రత, ఎప్పుడు, ఎక్కడ తుఫాను తీరం దాటొచ్చు, దాని వేగం, కురవబోయే వర్షపాతం వివరాలు ఈ హెచ్చరికలో ఉంటాయి. ప్రతి 3 గంటలకోసారి వివరాలు తెలుపుతుంటారు.
నాలుగో దశ హెచ్చరిక :
తుఫాను తీరం దాటడానికి కనీసం 12 గంటల ముందు.. తీరం దాటిన తరువాత తుఫాను గమనం ఎలా ఉండవచ్చు, ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉండవచ్చు.. అనే వివరాలను ఈ హెచ్చరికలో తెలియజేస్తారు.
Note : వివిధ రకాల తుఫాను హెచ్చరికలకు గాను వేర్వేరు సంకేత రంగులను ఉపయోగిస్తారు. తుఫాను అప్రమత్తతకు పసుపు రంగును, తుఫాను హెచ్చరికకు నారింజ రంగును, నాలుగో దశ హెచ్చరికకు ఎరుపు రంగు సంకేతాన్ని వాడుతారు.