Advertisement
1963 లో ” లవకుశ ” ఘనవిజయం తర్వాత NTR అనే హీరో ఒక దేవుడిలా మారిపోయాడు, ఇండస్ట్రీలో తన రేంజే మారిపోయింది! కానీ ఆ సినిమా తర్వాత చాలా కాలం వరకు NTRకి అంతటి హిట్ పడలేదు..మరో పక్క తన తోటి హీరోలైన ANR , కృష్ణలు బాక్స్ ఆఫీసు హిట్స్ కొడుతున్నారు .
ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోలేని హిట్ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న NTR…. తమిళ్ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ చేసిన కర్ణ మూవీ చూసి కర్ణుడి పాత్రని బేస్ చేసుకొని దుర్యోధనుడికి కర్ణుడి మధ్య స్నేహాన్ని వివరించేలా ఒక మంచి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి కథని తీసుకొని రిస్క్ చేయొద్దని చాలా మంది హెచ్చరించినా తను నమ్మిన సబ్జెక్ట్ కోసం తానే స్వయంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. డైలాగ్స్ మాత్రం కొండవీటి వెంకట కవి రాశారు.
Advertisements
కర్ణ , దుర్యోధన పాత్రలు తానే పోషించాలని ముందే డిసైడ్ అయ్యారు. శ్రీకృష్ణుని పాత్ర కోసం ANR గారిని సంప్రదించగా.. కృష్ణుని పాత్రలో మిమ్మల్ని చూసిన కళ్ళతో ప్రేక్షకులు నన్ను చూడలేరని సున్నితంగా తిరస్కరించారు ANR. దాంతో ఆ పాత్రను కూడా తానే వెయ్యాలని నిర్ణయించుకున్నాడు NTR .
Advertisement
- అభిమన్యుడిగా బాలకృష్ణ , అర్జునుడిగా మాదాల రంగారావు , చలపతిరావు , శారద , బి సరోజ , కె సత్యనారాయణ , వరలక్ష్మి , రాజనాల , గుమ్మడి ..లాంటి అతిరథమహారధులతో క్యాస్టింగ్ పూర్తి చేశారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు చేయగా…. డైరెక్టర్ కమ్ ప్రోడ్యూసర్ గా రామకృష్ణ సినీ బ్యానర్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు NTR .! ఆ సినిమానే “దాన వీర సూర కర్ణ “.
- సంక్రాంతి లోగా సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో….సెట్స్ అన్నీ రామకృష్ణ స్టూడియోలో వేసి కేవలం 43 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా తీయడానికైన ఖర్చు 10 లక్షలు.!
- ఈ చిత్రం జనవరి 14 1977 లో రిలీజ్ అయ్యింది . అదేరోజు కృష్ణ గారి కురుక్షేత్రం కూడా రిలీజ్ అయ్యింది. NTR త్రిపాత్రాభినయానికి, డైలాగ్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఈ సినిమాలోని ఏమంటివి….ఏమంటివి…. అనే డైలాగ్ తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచిపోతుంది . - కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా 9 సెంటర్ లలో 100 రోజులు ఆడింది. ఫస్ట్ రిలీజ్ లో కోటి రూపాయలు వసూలు చేయగా ….. 1994 లో మళ్ళీ రిలీజ్ చేయగా మళ్లీ కోటి రూపాయలు వసూలు చేసింది. తెలుగు సినీ చరిత్రలో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.
Advertisements