Advertisement
యూరప్ లో సిమోన్ అనే వ్యక్తి చేసిన నేరానికిగానూ అతనికి ఆకలితో చచ్చేదాక జైల్లో బంధించాలనే శిక్షను విధించారు. అతనికి కూతురు పెరూ తప్ప మరెవ్వరూ లేరు. అతనిని జైల్లో వేసి రెండు రోజులైంది. ఈ విషయం తెల్సుకున్న కూతురు జైలర్ తో ప్రత్యేక అనుమతి తీసుకొని..రోజుకోసారి నాన్నను కలవడానికి వచ్చేది…కానీ ఓ కండీషన్ మీద …అదేంటంటే…తండ్రిని చూడడానికి వచ్చేటప్పుడు ఎటువంటి తిను బండారాలు తీసుకురావొద్దు.!
షరతు ప్రకారం పెరు రోజూ వచ్చి తండ్రిని చూసి వెళ్లేది. నెలరోజులు గడిచినా…ఆ వ్యక్తి చనిపోకపోవడంతో అనుమానం వచ్చిన జైలు సిబ్బంది పెరును గమనించారు. ఎప్పటిలాగే వచ్చిన పెరూ తన స్తన్యాన్ని నాన్నకు తాపడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని జైలర్ కు తెలియజేయడంతో …విషయం న్యాయస్థానానికి వెళ్లింది.
Advertisement
ఎందుకిలా చేశావని..పెరూ ను అడగగా….. “నేను ఎదిగే క్రమంలో నా తండ్రి చేసిన దాంట్లో నేను చేసింది నథింగ్” అనింది. “నా తండ్రిని బతికించుకోడానికి నేను నా తండ్రికి తల్లినయ్యాను” అని చెప్పింది. మానవతా కోణంలో తండ్రికూతుళ్లిద్దరినీ విడిచిపెట్టారు.
Advertisements