Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

మొద‌టి సినిమాతో హిట్ కొట్టి….రెండ‌వ సినిమాకోసం వెయిటింగ్ లో ఉన్న ద‌ర్శ‌కులు!

Advertisement

ఒక్క ఛాన్స్ …ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేశారు. త‌మ‌కంటూ అవ‌కాశం రాగానే త‌మ స‌త్తాను చాటుకున్నారు ఈ డైరెక్ట‌ర్లు. తొలి సినిమాతో హిట్, సూప‌ర్ హిట్ , బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి చూపెట్టారు. ఇప్పుడు జాగ్ర‌త్త‌గా రెండో సినిమా ప్లానింగ్ లో ఉన్నారు. ఆఫ‌ర్లు వ‌రుస క‌ట్టిన కొరోనా కార‌ణంగా వాళ్ల రెండో ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉన్నాయి… మొద‌టి సినిమాతో హిట్ కొట్టి సెకెండ్ సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్న ఆ డైరెక్ట‌ర్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

 

1) సందీప్ రెడ్డి వంగా:

2017 లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందించిన డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా….అదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ హీరోగా కబీర్ సింగ్ గా రిమేక్ చేసి అక్క‌డ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.! రెండో సినిమా కోసం వెయింటింగ్ లో ఉన్నాడు!

sandeep reddy vanga

2) అజయ్ భూపతి:

Advertisements

2018లో కార్తీకేయ హీరోగా RX100 టైటిల్ తో … డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్ట‌ర్ అజయ్ భూపతి.! రెండో సినిమా కోసం ఆఫ‌ర్స్ వ‌చ్చినప్ప‌టికీ…ఆయ‌న సెకెండ్ మూవీ మాత్రం ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు.! శర్వానంద్ -సిద్దార్థ్ లు హీరోలుగా ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో ఓ ప్రాజెక్టు ఓకే అయ్యింద‌నే టాక్స్ త‌ప్ప అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

Advertisement

ajay bhupathi

 

3) రాహుల్ సంక్రుత్యాన్:

రాహుల్ సంక్రుత్యాన్….. 2018 లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘టాక్సీ వాలా’ చిత్రాన్ని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్. సినిమా యావ‌రేజ్ గా ఉన్న‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ ప‌నిత‌నాన్ని చాలా మంది మెచ్చుకున్నారు.!అందుకే స‌ద‌రు డైరెక్ట‌ర్ వెంట‌నే …. ‘శ్యామ్ సింగ రాయ’ అనే టైటిల్ తో రెండో సినిమాకు రెడీ అయిపోయాడు… నానీని హీరోగా కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ బ‌డ్జెట్ కార‌ణంగా నిర్మాత‌లు ఈ ప్రాజెక్ట్ ను హోల్ట్ లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

rahul

4) జ‌య‌శంక‌ర్

2018 లో పేప‌ర్ బాయ్ అంటూ…ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరిని తెర‌కెక్కించిన జ‌య‌శంక‌ర్…. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో “విటామిన్ షి” అంటూ మ‌రో ప్రాజెక్ట్ తో రెడీ అయిపోయిన‌ప్ప‌టికీ కొరోనా కార‌ణంగా  ఆ ప్రాజెక్ట్  ఇంకా పూర్తి అవ్వ‌లేదు.

Advertisements