Advertisement
శరత్ చంద్ర చటోపాధ్యాయ యొక్క ప్రసిద్ధ నవల ఆధారంగా తెలుగులో వచ్చిన సినిమా దేవదాస్….ఈ సినిమా నాగేశ్వర్రావ్ దశను మార్చేసింది. దేవదాస్ పాత్రలో ఏన్నార్ ను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలనంతగా మెప్పించాడు నాగేశ్వర్రావ్!
దేవదాస్ విడుదల :
తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలైన అన్ని థియేటర్లలో 100 రోజులు జరుపుకునన్న ఈ సినిమాను మొదట తెలుగులో….మూడునెలల తర్వాత తమిళ్ లో విడుదలచేశారు!
STORY:
రావులపల్లి జమీందారు (యస్.వీ.రంగారావు) రెండవ కొడుకు దేవదాస్ ( ఎన్నార్). దేవదాస్ పార్వతి చిన్నప్పటి స్నేహితులు.పై చదువుల కోసం దేవదాస్ ను పట్నం పంపిస్తారు. పట్నం నుండి వచ్చాక పార్వతిపై ఇష్టం పెంచుకుంటాడు దేవదాస్….ఈ విషయాన్ని గ్రహించిన పార్వతి తండ్రి సంబంధం మాట్లాడడానికి జమీందార్ వద్దకు వస్తే….జమీందార్ అతడిని అవమాన పరిచి పంపిస్తాడు. ఈ పెళ్లి జరిగితే తాను మరణిస్తానని బెదిరించడంతో దేవదాస్ కూడా తండ్రి మాటకు ఎదురుచెప్పలేక పట్నం వెళ్లిపోతాడు.
Advertisements
Advertisement
ఈక్రమంలో….. పార్వతి తండ్రి పక్క ఊరి జమీందారైన భుజంగరావుతో తన కూతురి పెళ్లిని నిశ్చయిస్తాడు. భుజంగరావుకు 40 ఏళ్ల పైనే, అప్పటికి భార్య మరణించి, పిల్లలు ఉంటారు. అప్పటికే తనను మర్చిపోమంటూ దేవదాస్ రాసిన ఉత్తరం చూసిన పార్వతి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది.
పార్వతి జ్ఞాపకాలతో దేవదాస్ మళ్లీ సొంతూరికి చేరుకుంటాడు…అప్పటికే ఆమె పెళ్లి విషయం తెల్సుకొని ఆమెను మర్చిపోయే నిమిత్తం మద్యానికి బానిస అవుతాడు.! మితిమీరిన తాగుడు కారణంగా అనారోగ్యంపాలై పార్వతి ఇంటి ముందు మరణిస్తాడు…పార్వతి సైతం దేవదాస్ ను చూడకుండా ఆదే సమయంలో చనిపోతుంది!
ANR దేవదాసు పాత్రకి ప్రాణం పోశారు. లెజండరీ హీరో దిలీప్ కుమార్ సైతం దేవదాస్ సినిమాలో అన్ని భాషల్లో నటించిన నటులతో పోల్చితే ANR చేసిన నటనను మాత్రమే తాను ఇష్టపడతాననిచెప్పారు .
Advertisements