Advertisement
క్రికెట్ ఆడేటప్పుడు మైదానంలో భారత జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కెప్టెన్‌గా ధోనీ టీమిండియాకు పలు ఘన విజయాలను సాధించి పెట్టాడు. అలాగే వికెట్ కీపర్‌గా జట్టుకు అనిర్వచనీయమైన సేవలు అందిస్తున్నాడు. అయితే టీమిండియా కావొచ్చు.. ఐపీఎల్ చెన్నై జట్టు కావచ్చు.. దేనికి ఆడినా సరే.. ధోనీ అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్ఎస్)ను మాత్రం 100 శాతం ఉపయోగించుకుంటాడనే చెప్పవచ్చు. పలు సందర్భాల్లో నిజానికి అంపైర్లు ఇచ్చిన ఫలితాలు కూడా ధోనీ కలగజేసుకోవడం వల్ల మారిపోయాయి. అంపైర్లు ఆయా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని తేలింది. ధోనీ డీఆర్ఎస్‌ను అంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు. ఈ క్రమంలోనే ధోనీ డీఆర్ఎస్ తీసుకున్న సందర్భాల్లో విజయవంతం అయిన టాప్ 5 మూమెంట్స్‌ను ఇప్పుడు చూద్దాం.
1. ఆసియా కప్ (2018)
— CricBoll (@mycricboll) September 23, 2018
Advertisements
2018లో పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్‌కు బంతి విసరగా అది లెగ్ బిఫోర్ అయింది. కానీ అంపైర్ స్పందించలేదు. వికెట్ల వెనుక ఉన్న ధోనీ ఆ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మను డీఆర్ఎస్ తీసుకోమని చెప్పగా.. రోహిత్ అలాగే చేశాడు. ఈ క్రమంలో బంతి పర్ఫెక్ట్ ఎల్‌బీడబ్ల్యూ అని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయం మార్చుకుని పాక్ బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఇలా ధోనీ డీఆర్ఎస్‌ను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు.
2. ఇంగ్లండ్‌తో వన్డే 2018
The same crowd cheered after DRS(Dhoni review system),
who had jeered him at Lord's.
Finisher in need is DHONI indeed.#HypocriticalLove #INDvENG pic.twitter.com/9HoVBaBqMI— Accidental Journalist (@joBless_God) July 17, 2018
2018లో జూలై నెలలో ఇంగ్లండ్‌తో అక్కడి లీడ్స్ మైదానంలో జరిగిన 3వ వన్డేలో స్పిన్నర్ మోయిన్ అలీ 32 ఓవర్‌లో ధోనీకి బంతి వేశాడు. అది కాలికి తగిలినట్లు అనిపించడంతో ఇంగ్లండ్ టీం ఎల్‌బీకి అప్పీల్ చేసింది. కానీ ధోని డీఆర్ఎస్ తీసుకున్నాడు. రీప్లేలో బంతి వికెట్లను తాకదని స్పష్టమైంది. దీంతో అంపైర్ నిర్ణయాన్ని మార్చుకుని ధోనీని నాటౌట్‌గా ప్రకటించాడు.
Advertisement
3. పూణె వన్డే, 2017
MS Dhoni gets the DRS call Bang on! https://t.co/b181Dg9xp0
— Aditya Pandey (@adityapandey148) January 24, 2019
2017లో పూణె ఎంసీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ ఆడి 350 పరుగులు చేసింది. అయితే ధోనీ డీఆర్ఎస్ తీసుకుని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను గనక ఔట్ చేయకపోయి ఉంటే.. ఇంకా ఎక్కువ పరుగులు నమోదై ఉండేవి. పాండ్యా విసిరిన బంతిని ఆడిన మోర్గాన్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. కానీ అంపైర్ పట్టించుకోలేదు. ధోనీ సూచనతో కెప్టెన్ కోహ్లి డీఆర్ఎస్‌కు వెళ్లాడు. దీంతో మోర్గాన్ ఔట్ అని తేలింది. లేకపోతే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇంకా ఎక్కువ పరుగులు చేసి ఉండేది. టీమిండియా ఛేదనకు మరింత కష్టం అయి ఉండేది. ధోనీ డీఆర్ఎస్ సమయస్ఫూర్తితో ఆ గండం నుంచి గట్టెక్కారు.
4. కటక్ వన్డే, 2017
Decision Review System or Dhoni review system? https://t.co/hy8A2YXCgF
— Aditya Pandey (@adityapandey148) January 24, 2019
2017 జనవరి నెలలో ఇంగ్లండ్‌తో కటక్‌లో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో ధోనీ తన సూపర్ నాచురల్ విజన్‌తో మరో ప్రమాదం నుంచి ఇండియన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌ను తప్పించాడు. యువరాజ్ సింగ్ క్యాచ్‌పై ధోనీ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. నిజానికి యువీ కూడా తాను ఔట్ అనే భావించాడు. కానీ డీఆర్ఎస్‌లో అతను నాటౌట్ అని తేలింది. అలా ధోనీ డీఆర్ఎస్‌ను అడగడంలో మరోసారి తన సమర్థతను చాటుకున్నాడు.
5. కోల్‌కతా 2018 ఐపీఎల్ మ్యాచ్
Dhoni review system on point https://t.co/HtWejye8HB via @ipl
— Aditya Pandey (@adityapandey148) January 24, 2019
Advertisements
2018లో కోల్‌కతాతో అక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ లుంగి ఎంగిడి వేసిన బంతి కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ బ్యాటుకు లైట్‌గా తగిలింది. స్లిప్‌లో క్యాచ్ పట్టారు. ఎంగిడి అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో చెన్నై కెప్టెన్ ధోనీ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. అందులో బంతి బ్యాట్‌కు తగిలినట్లు ఉంది. దీంతో ఔట్ ఇచ్చారు. అలా మరోసారి ధోనీ డీఆర్ఎస్ సిస్టమ్‌ను ఉపయోగించుకోవడంలో తాను కింగ్‌నని చాటుకున్నాడు.