Advertisement
మహేంద్ర సింగ్ ధోని…. టీమ్ మేనేజ్మెంటే కాదు, మనీ మేనేజ్మెంట్ బాగా తెలిసిన వాడు! అందుకే రిటైర్డ్ అయ్యే ముందు తనకు అందుబాటులో ఉన్న అన్ని యాడ్స్ పై సైన్ చేశాడు.! గోడాడీ, కార్ 24 , డ్రీమ్ 11, ఖాతాబుక్ ఇవన్నీ ఇటీవల సైన్ చేసిన యాడ్సే! వాటి ద్వారా భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకున్నాడు.
ధోని కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు…తనకు చేతి నిండా డబ్బులు వచ్చే క్రమంలో వాటిని రియల్ ఎస్టేట్ తో పాటు మరికొన్ని చిన్న చిన్న కంపెనీల్లో పెట్టుబడుటు పెట్టాడట! రీసెంట్ మ్యూచువల్ ఫండ్స్ ను ప్రమోట్ చేస్తూ….అక్కడి నుండి డబ్బు తీసుకోకుండా తనకు రెమ్యునరేషన్ గా రావాల్సిన డబ్బును కూడా అందులోనే ఇన్వెస్ట్ చేశాడంట!
తాజాగా కడక్ నాథ్ కోళ్ళ బిజినెస్ ….?
Advertisement
అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోని…ప్రస్తుతం ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు, దానితో పాటు కడక్ నాథ్ కోళ్ల పెంపకాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.. రాంచీలోని తన ఫామ్ హౌస్ లో ఓ 2000 వేల కోళ్లతో దీన్ని ప్రారంభించాలని భావించి….మధ్యప్రదేశ్ లోని కడక్ నాథ్ కోళ్ల పరిశోధన స్థానం డైరెక్టర్ ఐఎస్ తోమర్ ను సంప్రదించాడు… ఆయన సలహా మేరకు ఝబువా గ్రామంలోని వినోద్ మేండా అనే రైతు దగ్గరి నుండి ఈ కడక్ నాథ్ కోళ్లను దిగుమతి చేసుకోనున్నాడు.
Advertisements
కడక్ నాథ్ కోళ్ల స్పెషాలిటీ ఏంటి? గుడ్డు, మాంసం రేటెలా ఉంటుంది?
కడక్ నాథ్ లో కోడిలాగే దాని మాంసం, రక్తం కూడా నల్ల రంగులోనే ఉంటాయి.! అయితే దీనిలో కొవ్వు, కొలెస్ట్రాల్ శాతాలు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ కోళ్ళలో 25% కొవ్వు ఉంటే వీటిలో 1.94% మాత్రమే ఉంటుంది. కొలెస్ట్రాల్ విషయానికొస్తే సాధారణ కోళ్ళలో 218mg ఉంటే కడక్ నాథ్ కోళ్ళలో 59mg మాత్రమే ఉంటుంది. ఈ కడక్‌నాథ్ కోళ్లకు 2018లోనే జీఐ ట్యాగ్ కూడా లభించింది.
Advertisements
కడక్ నాథ్ కోడి గుడ్డు ఖరీదు – 50 రూపాయలకు పైనే ఉంటుంది. ఇక కేజీ మాంసానికైతే 700 నుండి 1000 వరకు ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది కడక్ నాథ్ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు.