Advertisement
ఆగస్ట్ 15…నేటితో భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 73 ఏళ్లు నిండాయి.! ఇదే సందర్భంలో….ఇండియన్ క్రికెట్ ను టాప్ గేర్ లోకి మార్చిన ధోని , అతని నమ్మిన బంటు రైనా…ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. యాదృచ్చికమో ఏమో కానీ…ధోని జెర్సీ నెంబర్ 7, రైనా జెర్సీ నెంబర్ 3……దేశ స్వాతంత్ర్యానికి 73 ఏళ్లు నిండాయి. ఇండియన్ క్రికెట్ టీమ్ నుండి 7,3 నెంబర్లు బయటికి వెళ్లాయి!
ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే…అతని అనుచరుడు రైనా కూడా తన రిటైర్మెంట్ ను ప్రకటించేశాడు.! రైనా మొదటి నుండి ధోనికి నమ్మిన బంటుగా ఉన్నాడు. అందుకే ….ఐపియల్ లో ధోని ఎటుంటే…రైనా అటుండే వాడు.! రైనా చాలా సార్లు ధోనికి సపోర్ట్ గా నిలిచాడు. దీనికి తోడు ధోని ఫ్యామిలీకి కూడా మంచి ఫ్రెండ్! ఆటలో ఎన్నో సార్లు ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రైనా నిలబెడుతూ వచ్చాడు!
Advertisement
ధోని గురించి క్లుప్తంగా…
2004 లో బంగ్లాదేశ్ తో తన తొలి వన్డే మ్యాచ్ ఆడిన ధోని…341 మ్యాచ్ లు ఆడాడు.! 10 సెంచరీలు, 71 హాప్ సెంచరీల సహాయంతో…. 10,500 పరుగులు చేశాడు. ప్రపంచంలోనే దిబెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరుగాంచాడు!
కెప్టెన్ గా ధోని.
కెప్టెన్ గా ఇండియాకు చిరస్మరణీయ విజయాలను అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్! 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన మహీ…అదే ఏడాది ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ కప్ ను గెలిపించాడు! 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇండియన్ టీమ్ కు కెప్టెన్ అతను… అతని సారథ్యంలో మొదటి సారి భారత్ 2009లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి వెళ్లింది!
రైనా;
2005 లోనే తన వన్డే క్రికెట్ కెరీర్ ను ప్రారంభించినప్పటికీ…ఇప్పటి వరకు 36 మ్యాచ్ లే ఆడాడు. రైనా ఐపియల్ తో మంచి పేరు సంపాధించుకున్నాడు. రైనాను అందరూ కెప్టెన్స్ ఫేవరేట్ ప్లేయర్ గా అభివర్ణించేవారు.!
Advertisements
Advertisements