Advertisement
ఒక వరల్డ్ కప్, ఒక టీ ట్వంటీ కప్ ను ఇండియాకు అందిచిన కెప్టెన్ అతను, హెలికాఫ్టర్ షాట్ అతని పెహచాన్.! వ్యక్తిత్వంలో మిస్టర్ కూల్, మ్యాచ్ ను ముగించడంలో ధనాధన్, కెప్టెన్సీ లో మిస్టర్ చాణక్య., ఫ్యాన్స్ కు తలైవా…… అతనే జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని….ధోని తన క్రికెట్ కెరీర్ లో సాధించిన 7 రికార్డ్స్ ఏవో తెలుసుకుందాం.
1. కెప్టెన్ గా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్!
ధోని ఇప్పటివరకు తన కెరీయర్లో అన్ని ఫార్మాట్ లు కలుపుకొని 332 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు . ఈ 332 మ్యాచుల్లో 178 సార్లు ఇండియా గెలిచింది . ధోని తర్వాత కోహ్లీ ఉన్నాడు…కోహ్లీ ఇప్పటి వరకు 157 అంతర్జాతీయ మ్యాచెస్ లో టీమ్ ఇండియా కి నాయకత్వం వహించాడు.
2 స్టంపౌట్ లు ఎక్కువగా చేసిన కీపర్
Advertisements
ధోని ఇప్పటివరకు మొత్తం మూడు ఫార్మాట్స్ ని కలుపుకొని , 538 మ్యాచ్చుల్లో 195 సార్లు వికెట్లను గిరాటేసి బ్యాట్స్ మెన్స్ ను న ఫెవిలియన్ కు పంపాడు . ఇతని తర్వాత సెకెంట్ ప్లేస్ లో బంగ్లాదేశ్ కీపర్ ముఫ్పీకర్ రహీం ఉన్నాడు..ఇతను 87 స్టంపౌట్స్ చేశాడు
Advertisement
3. ఎక్కువ సార్లు నాటౌట్ గా నిలిచిన బ్యాట్స్ మెన్
ధోని ఇప్పటివరకు అన్ని ఫార్మాట్స్ ని కలుపుకొని 142 సార్లు నాట్ ఔట్ గా నిలిచాడు .
4. వన్డే ఫార్మాట్ లో అతి తక్కువ కాలంలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఆటగాడు!
2004 డిసెంబర్ లో వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టిన ధోని కేవలం 15 నెలల్లో ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.
5. ఎక్కువ సార్లు మ్యాచ్ ను సిక్స్ తో ముగించిన ప్లేయర్.
ధోని వరల్డ్ లోనే బెస్ట్ ఫినిషర్ అని చెప్పడానికి నిదర్శనం ఈ రికార్డ్ . ధోని ఇప్పటివరకు మూడు ఫార్మర్ట్ లను కలుపుకొని 13 సార్లు టీమ్ ఇండియాని సిక్సర్స్ తో గెలిపించాడు .
6. క్వికెస్ట్ స్టంపింగ్ ఇన్ క్రిక్రెట్ హిస్టరీ
2018 లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు కీమో పాల్ అనే బ్యాట్స్ మ్యాన్ ని ధోని కేవలం 0.08 సెకండ్స్ లో స్టంప్ ఔట్ చేసి షాకిచ్చాడు. క్రికెట్ చరిత్రలో ఇదే క్వికెస్ట్ స్టంపౌట్!
7. అన్ని ఐసిసి ట్రోపీలను గెలిచిన కెప్టెన్.
Advertisements
2007 వ సంవత్సరంలో మొట్టమొదటి టి20 వరల్డ్ కప్ ను, 2011 లో వన్డే వరల్డ్ కప్ , 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపిని తన నాయకత్వంలో గెలిపించాడు.