Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

19:29 కే ధోని రిటైర్మెంట్ ఎందుకు ప్ర‌క‌టించాడు…ఈ నెంబ‌ర్ స్పెషాలిటీ ఏంటి?

Advertisement

ధోని బేసిక్ గా న్యుమ‌రాల‌జీని బాగా న‌మ్ముతాడు.! అందుకే త‌న ల‌క్కీ నెంబ‌ర్ 7 నే త‌న జ‌ర్సీ నెంబ‌ర్ గా మార్చుకున్నాడు.! ఆగ‌స్ట్ 15 త‌న ఇన్స్టాగ్రామ్ లో 19:29 స‌మ‌యం నుండి నేను అంత‌ర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న‌ట్టు భావించండి అంటూ ప్ర‌క‌టించాడు. సాధారణంగా ఇండియాలో 12 గంట‌ల స‌మ‌యాన్ని ఫాలో అవుతాం….అలాంటిది ధోని 19:29 అంటూ 24 గంట‌ల టైమ్ ను ప్ర‌స్తావిస్తూ త‌న రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించాడు. !

ms dhoni

Advertisement

ఎందుకిలా? ఈ నెంబ‌ర్ ప్ర‌త్యేక‌త ఏంటి?
0000,1111,2222,0123,12131415……ఇలా ఒక సీక్వెన్స్ ను ఫాలో అయ్యే నెంబ‌ర్స్ ను ఏంజిల్ నెంబ‌ర్స్ అంటారు. ఈ లెక్క‌న ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన నెంబ‌ర్ 19, 29 కూడా ఏంజిల్ నెంబ‌ర్ యే….ఈ ఏజింల్ నెంబ‌ర్ ప్ర‌స్తావించారు అంటే ….ఓ వ్య‌క్తి త‌న ఆత్మ సాక్షిగా, నిబ‌ద్ద‌త‌తో ఓ గొప్ప కార్యాన్ని పూర్తిచేశాడ‌ని అర్థం! ఆ కార్యం వ‌ల్ల సంతృప్తి పొందుతున్నాడ‌ని అర్థం! ఇండియాకు స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ గా T20 వ‌ర‌ల్డ్ క‌ప్. , ODI వ‌రల్డ్ క‌ప్ , టెస్ట్ లో ఇండియాను నెం1 స్థానంలో నిల‌బెట్ట‌డం, ప్రపంచంలోనే ది బెస్ట్ ఫినిష‌ర్ గా నిలిచిపోవ‌డం….ఇలా ఎన్నో విజ‌యాల‌ను అందించాడు…దీన్ని బ‌ట్టి అత‌డు ఓ గొప్ప కార్యాన్ని సంతృప్తితో పూర్తిచేశాడ‌నుకోవొచ్చు!

  • ఇక 24 గంట‌ల టైమింగ్ లో ఎందుకు చెప్పాడంటే…ధోని మొద‌ట రైల్వే ఎంప్లాయిగా త‌న కెరీర్ ను స్టార్ట్ చేశాడు, ఇటీవ‌ల సైన్యంలో క‌ల్న‌ల్ లాంటి గౌర‌వ హోదాను పొందాడు. రైల్వే, ఆర్మీలో 24 గంట‌ల టైమింగ్ ను ఫాలో అవుతారు…అందుకే ధోని త‌న రెండు డిపార్ట్మెంట్ ల‌ను గౌర‌విస్తూ ఇలా ప్ర‌స్తావించి ఉండొచ్చు.
  • 19:29 అంటే 7 గంట‌ల 29 నిమిషాలు….7 ఎలాగో ధోని ల‌క్కీ నెంబ‌ర్ యే!

ఈ లెక్క‌లు ఎలా ఉన్నా….భార‌త క్రికెట్ స్థాయిని పెంచిన ఆట‌గాడిగా ధోని చిర‌స్థాయిగా నిలిచిపోతాడు.! హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ధోని సార్!

Advertisements