Advertisement
ఇప్పుడు మనకంటే అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరుగుదొడ్ల పరంగా అనేక రకాలైన టాయిలెట్లను మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నాం. ఆటోమేటిగ్గా ఫ్లష్ చేసే వాటితోపాటు మాన్యువల్‌గా ఫ్లష్ చేసేవి, వెస్టర్న్ టాయిలెట్లు.. ఇలా రకరకాల టాయిలెట్లను మనం వాడుతున్నాం. అయితే ఇప్పుడు ఇలాంటి అధునాతన టాయిలెట్లు ఉన్నాయి కానీ.. ఒకప్పుడు.. అంటే పూర్వకాలంలో కూడా ఇలాగే టాయిలెట్లు ఉండేవా..? రాజులు కూడా టాయిలెట్ కోసం బయటకు వెళ్లేవారా..? అంటే..
లేదు.. పురాతన భారతీయులు టాయిలెట్ కోసం బయటకు వెళ్లేవారు కాదు. కొందరు ధనికులతోపాటు రాజులు కూడా తమ నివాసాల్లో టాయిలెట్లను కలిగి ఉండేవారు. కాకపోతే అవి ఇప్పుడు మనం వాడుతున్న టాయిలెట్లలా ఉండేవి కావు. కానీ మన టాయిలెట్లను అవి పోలి ఉండేవి. అందుకు చిత్రంలో చూపిన టాయిలెటే ఉదాహరణ.
Advertisement
పైన చిత్రంలో మీరు చూస్తున్నది రాజస్థాన్ కోటలోని బుంది అనబడే రాయల్ టాయిలెట్. దీన్ని అప్పట్లో కేవలం రాజ కుటుంబీకులు మాత్రమే వాడేవారు. ఇక ఇండస్ లోయ నాగరికత గురించి తెలుసుకునేందుకు జరిపిన తవ్వకాల్లో సుమారుగా 5వేల ఏళ్ల కిందటి.. అంటే.. క్రీస్తుపూర్వం 3100 సంవత్సరం నాటి టాయిలెట్లు బయట పడ్డాయి. వాటిలో ఫ్లష్ టాయిలెట్లు, నాన్ ఫ్లష్ టాయిలెట్లు కూడా ఉండడం విశేషం. అంటే.. అప్పట్లోనే వారు మరుగుదొడ్లను ఉపయోగించేవారన్నమాట. ఇక టాయిలెట్ల నుంచి కిందకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉండేది. దాంట్లో నుంచి మురుగు బయటకు వెళ్లేది.
Advertisements
పైన ఇచ్చింది తవ్వకాల్లో బయటపడ్డ ఓ పురాతన టాయిలెట్. ఇది సుమారుగా 5వేల ఏళ్ల కిందటిదని భావిస్తున్నారు. అందులో ఇప్పట్లోలా టాయిలెట్, సంపు నిర్మాణాలను మనం గమనించవచ్చు.
Advertisements
పైన ఫొటోలో ఉన్న టాయిలెట్ ఇండియన్ స్టైల్‌లో నిర్మించబడింది. ఇవన్నీ పురాతన కాలంలో భారతీయులు వాడిన టాయిలెట్ల నిర్మాణాలు. అందువల్ల టాయిలెట్ల వాడకం అనేది ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో ఉందని మనకు అర్థమవుతుంది.