Advertisement
భారత జాతిపిత మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే హ….. త్య చేశాడన్న విషయం తెలిసిందే. 1948వ సంవత్సరం జనవరి 30వ తేదీన న్యూఢిల్లీలో గాంధీని గాడ్సే చంపాడు. అయితే దీని వెనుక కారణాలు ఏమున్నప్పటికీ గాంధీ అంత్యక్రియలకు అప్పటి ఆయన సహచరుడు జిన్నా హాజరయ్యాడా, లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంటుంది. మరి జిన్నా ఆ కార్యక్రమానికి వచ్చాడా, లేదా..? అంటే..?
మహాత్మాగాంధీ అంత్యక్రియలకు జిన్నా హాజరు కాలేదు. అవును. నిజం. కానీ గాంధీ మృతికి చింతిస్తూ జిన్నా లేఖ ద్వారా సందేశం పంపాడు. అందులో ఏముందో.. అతని మాటల్లోనే…
Advertisement
”గాంధీపై జరిగిన దాడి వల్ల ఆయన చనిపోయాడనే వార్త విని నేను షాక్‌కు గురయ్యా. మా మధ్య ఎన్నో రాజకీయ విభేదాలు ఉండేవి, అయినా హిందూ వర్గం తయారు చేసిన గొప్ప వ్యక్తి గాంధీ.. ఆయన ఒక గొప్ప నాయకుడు. ప్రపంచం మొత్తం ఆయన్ను నమ్ముతుంది, ఆయనకు మర్యాద ఇస్తుంది. ఆయన మృతి పట్ల నేను తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. భారత్, పాకిస్థాన్ దేశాలకు స్వాతంత్య్రం లభించిన చారిత్రక సమయంలో ఆయన మృతి చెందడం బాధాకరం. ఆయన మృతి వల్ల భారతదేశానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయలేము. ఆయన మన మధ్య లేడనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.”
Advertisements
Advertisements
అయితే నిజానికి మహాత్మా గాంధీ భారత్ నుంచి విడిపోయిన పాకిస్థాన్‌కు లాభం చేకూర్చేలా యత్నించారు. భారత్ నుంచి కొత్తగా ఏర్పడ్డ పాకిస్థాన్ దేశానికి సహాయంగా నిధులను కూడా ఇప్పించారు. అలాగే దేశంలో ఏ వర్గాన్నీ ఆయన తక్కువగా చూడలేదు. అందరినీ గాంధీ సమానంగానే చూశారు. అయినప్పటికీ జిన్నా వాటిని పట్టించుకోకుండా.. గాంధీని హిందూ నాయకుడనే అభివర్ణించాడు. కానీ భారత ప్రజల గుండెల్లో మాత్రం గాంధీ ఎప్పటికీ నిలిచి ఉంటారు.