Advertisement
మహాభారతంలో పాండవులు, కౌరవులకు మధ్య 18 రోజుల పాటు కురుక్షేత్ర యుద్దం జరిగిందన్న విషయం విదితమే. అందులో ఇరు వైపుల నుంచి ఎన్నో లక్షల మంది చనిపోయారు. పాండవ సేవ, కౌరవ సేన చాలా వరకు నాశనమవుతాయి.
కురుక్షేత్ర యుద్ధం ముగిశాక రణ రంగంలో పడి ఉన్న లక్షల మంది సైనికుల మృతదేహాలను చూసి ధర్మరాజు కలత చెందుతాడు. అతన్ని ధ్రుతరాష్ట్రుడు ఓదారుస్తాడు. యుద్ధంలో ఎంతో మంది చనిపోయారని, చాలా మందికి కుటుంబాలు ఉన్నాయని, కొందరు అనాథలని, వారందరి మృతదేహాలను రణరంగంలో గద్దలు, రాబందులు పీక్కు తింటున్నాయని.. కనుక ఆ మృతదేహాలను అలా విడిచిపెట్టకుండా వాటికి దహన సంస్కారాలు జరిపించాలని ధ్రుతరాష్ట్రుడు ధర్మరాజుకు చెబుతాడు.
Advertisement
అనంతరం ధర్మరాజు మృతదేహాలను ఒక్క చోట చేర్పిస్తాడు. ఆ పని చేయాల్సిందిగా సుధర్ముడు, ధౌమ్యుడు, సంజయుడు, విదురుడు, కౌరవ్య యుయుత్సులతోపాటు పనివాళ్లను ధర్మరాజు ఆదేశిస్తాడు. వారు సైనికులందరి మృతదేహాలను ఒక్క చోట చేర్చి పైన నూనె చల్లుతారు. దాని తరువాత ధర్మరాజు సంప్రదాయం ప్రకారం వారికి దహన సంస్కారాలు జరిపిస్తాడు. అనంతరం అతను గంగానది వైపుకు వెళ్తాడు.
– మహాభారతంలోని శ్రద్ధ పర్వ అధ్యాయం 1327(26)
Advertisements
Advertisements