Advertisement
మన దేశంలోని రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా సిక్కు వర్గానికి చెందిన వారు నివసిస్తారన్న సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చండీగఢ్ రాజధానిగా ఉంది. అయితే మన దేశంలోనే కాదు, పాకిస్థాన్‌లోనూ ఒక పంజాబ్ ఉంది. అవును. భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు అంతా కలిసే ఉండేది. కానీ విడిపోయాక అక్కడ ఒక పంజాబ్, ఇక్కడ ఒక పంజాబ్‌గా మారింది. ఈ క్రమంలో రెండు పంజాబ్‌లకు ఉన్న తేడాలను ఒక్కసారి గమనిద్దాం.
మన దేశంలో ఉన్న పంజాబ్ కన్నా పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ రాష్ట్రం వైశాల్యమే ఎక్కువ. పాకిస్థాన్ పంజాబ్ వైశాల్యం 2,05,344 చదరపు కిలోమీటర్లు. భారత్ పంజాబ్ వైశాల్యం 50,362 చదరపు కిలోమీటర్లు. అయితే పాకిస్థాన్ కన్నా మన దేశంలోని పంజాబ్‌లోనే అక్షరాస్యత శాతం ఎక్కువ. అక్కడ అది 64.7 శాతం ఉంటే మన దగ్గర 75.84 శాతం ఉంది.
Advertisement
పాకిస్థాన్ పంజాబ్ జీడీపీ ఎక్కువ. కానీ మన పంజాబ్ కు చెందిన జీడీపీ పర్ కాపిటా ఎక్కువ. ఇండియన్ పంజాబ్ జీడీపీ 81 బిలియన్ డాలర్లు కాగా పాకిస్థాన్ పంజాబ్ జీడీపీ 162 బిలియన్ డాలర్లు. పాకిస్థాన్ పంజాబ్ జనాభా 110 మిలియన్లు కాగా ఇండియన్ పంజాబ్ జనాభా 30 మిలియన్లు. పాకిస్థాన్ పంజాబ్‌లో నివసించే జనాభాలో 97.21 శాతం మంది ముస్లింలే. అక్కడ క్రిస్టియన్లు, హిందువులు మైనార్టీలు. ఇండియన్ పంజాబ్‌లో సిక్కులు, హిందువులు ఎక్కువగా ఉంటారు. పాక్ పంజాబ్‌లో పంజాబీని గుర్ముఖిలో రాస్తారు. అదే ఇండియాలో అయితే షాముఖిలో రాస్తారు.
Advertisements
ఇండియన్ పంజాబ్‌లో పంజాబీ ఎక్కువగా మాట్లాడుతారు. అదే పాకిస్థాన్ పంజాబ్ లో అయితే ఉర్దూ మాట్లాడేవారు ఎక్కువ. పాకిస్థాన్ పంజాబ్‌లో పేదరికం ఎక్కువ. అక్కడ 31 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా, మన పంజాబ్‌లో 8 శాతం మంది పేదలు ఉన్నారు. పాక్ పంజాబ్ రాజధాని లాహోర్ కాగా, మన పంజాబ్ రాజధాని చండీగఢ్.
Advertisements
మొత్తంగా చూసుకుంటే జనాభా, విస్తీర్ణంలో పాకిస్థాన్ పంజాబ్ పెద్దదిగా ఉంది. కానీ అభివృద్ధి, ఇతర విషయాల్లో ఇండియా పంజాబే ముందుంది.