Advertisement
యుద్ధంలో శత్రు దేశాలకు చెందిన సైనికులను అంతమొందించేందుకు ఇతర సైనికులు అనేక పథకాలను, వ్యూహాలను రచిస్తుంటారు. ఎటు చేసీ యుద్ధంలో గెలవాలన్నదే ఆయా దేశాలకు చెందిన సైనికుల ఉద్దేశం. అందులో భాగంగానే అనేక రకాల ట్రాప్ (ఉచ్చు)లను కూడా అమరుస్తాంటారు. సహజంగానే అవి బాంబులను కలిగి ఉంటాయి. అయితే వియత్నాం యుద్ధంలో మాత్రం సైనికులు శత్రువుల కోసం భిన్న రకాల, వెరైటీ ఉచ్చులను కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి తెలుసుకుంటే నిజంగా ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది. అంత చాకచక్యంగా వారు ఉచ్చులను అమర్చారు. వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేద్దామా..!
1. క్యాట్రిడ్జ్ ట్రాప్:
చిత్రంలో చూశారు కదా.. భూమి లోపల చిన్నపాటి గుంత తవ్వుతారు. అందులో ఒక బుల్లెట్‌ను వెదురు బొంగులో అమరుస్తారు. దాని కింది భాగంలో చిన్న పిన్ ఉంటుంది. పైన ఎవరైనా అడుగు పెడితే కింది భాగంలో ఉండే పిన్ యాక్టివేట్ అయి బుల్లెట్‌ను పేలుస్తుంది. దీంతో ఆ బుల్లెట్ దానిపైన ఉన్న కాలులోకి దూసుకెళ్తుంది. దీంతో శత్రు సైనికులు గాయాలకు గరవుతారు. నిజానికి ఈ తరహా ఉచ్చులు చాలా తక్కువ ఖర్చవుతాయి. ఇలాంటి ఉచ్చులను కొన్ని వేలకు వరకు అమర్చవచ్చు.
2. బూబీ ట్రాప్:
ఇది నిజానికి ఓ మందు పాతర లాంటిదని చెప్పవచ్చు. పైన డబ్బాకు అమర్చిన మేకు భూమి లోపల ఉంటుంది. అందువల్ల అది కనిపించదు. దానిపై అడుగు పడితే ఆ మేకు కిందకు దిగుతుంది. డబ్బా కింది భాగంలో ఉండే గ్రెనేడ్‌కు అది కనెక్ట్ అయి ఉంటుంది కనుక.. మేకుపై అడుగు పడగానే ఆ ఒత్తిడికి కింది భాగంలో ఉండే గ్రెనేడ్ పేలుతుంది. దీంతో పేలుడు జరిగి శత్రువులు మరణిస్తారు. దీన్ని ఎక్కువగా భారీ ఎత్తున నష్టం కలిగించేందుకు ఉపయోగిస్తారు.
Advertisements
3. హ్యాంగింగ్ స్పైక్ ట్రాప్:
వెదురు బొంగుల నుంచి తయారు చేసిన పొడవైన, వంగే కర్రలతో ఈ ట్రాప్‌ను అమరుస్తారు. కింది భాగంలో ఉచ్చు ఉంటుంది. పై భాగంలో మలమూత్రాలతో నిండిన ట్రాప్ మరొకటి ఉంటుంది. కింది ఉచ్చుపై కాలు పడగానే దానికి అనుసంధానమై ఉండే తీగల ద్వారా పైన ఉచ్చు వచ్చి మీద పడుతుంది. అప్పుడు ఆ ట్రాప్‌లోని వ్యర్థాలన్నీ మీద పడతాయి. దీని వల్ల ఎక్కువగా నష్టం ఉండదు. కానీ సైనికులు కొంత వరకు గాయపడతారు. అలాగే తీవ్రమైన అవస్థ పడతారు.
Advertisement
4. స్పైక్ ట్రాప్:
సాధారణంగా సైనికుల బూట్ల అడుగు భాగంలో మేకులు గుచ్చుకున్నా గాయం కాకుండా ఉండేవిధంగా అమరిక ఉంటుంది. అందుకని వారి కోసం ఇలాంటి ట్రాప్‌లు అమరుస్తారు. ఇందులో కాలు పూర్తిగా గుంతలోకి దిగబడుతుంది. తరువాత పైనుంచి మేకులు పాదాలు, మడమల మీద గుచ్చుకుంటాయి. ఈ ట్రాప్ వల్ల కాళ్లకు తీవ్రమైన గాయాలవుతాయి.
5. వాస్ప్ ట్రాప్:
చిత్రంలో ఇచ్చింది కందిరీగ గూడు. శత్రు దేశాల సైనికులను గాయ పరిచేందుకు ఈ గూళ్లను కూడా అమరుస్తారు. ఓ ట్రాప్‌కు వాటిని అమరుస్తారు. ట్రాప్‌లో కాలు పడితే పై నుంచి ఆ గూడు వచ్చి మీద పడుతుంది. అప్పుడు ఆ గూడులో ఉండే కందిరీగలు దాడి చేస్తాయి. దీని వల్ల కూడా సైనికులు గాయాల బారిన పడతారు.
Advertisements
అయితే పైన తెలిపిన ట్రాప్‌లలో ఒక్క గ్రెనేడ్ ట్రాప్ తప్ప మిగిలిన ట్రాప్‌లన్నీ సైనికులను గాయపరిచేవే. కానీ చంపేవి కావు. ఇలా ఎందుకు చేస్తారంటే.. సాధారణంగా యుద్ధంలో ఒక సైనికుడు చనిపోతే అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అదే ఒక సైనికుడు గాయపడితే అతని కోసం ఇద్దరు సైనికులు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడే వ్యూహం అమలవుతుంది. ఇలా పెద్ద మొత్తంలో ట్రాప్‌ల ద్వారా సైనికులను గాయపరిస్తే వారు యుద్ధంలో సహజంగానే స్లో అవుతారు. దీంతో అవతలి వారిది పైచేయి అవుతుంది. అదే వారిని చంపితే పెద్దగా ప్రయోజనం ఉండదు. మిగిలిన వారు ముందుకు సాగుతారు. కానీ చనిపోయిన వారిని పట్టించుకోరు. అందుకనే సైనికులు ఇలాంటి ఉచ్చులను అమర్చి యుద్ధాల్లో ముందుకు సాగుతుంటారు.