Advertisement
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి చెందిన సాంకేతిక సిబ్బంది నటి రియా చక్రవర్తి సహా పలువురి ఫోన్లను క్లోన్ చేసి వాటిల్లో ఉన్న వాట్సాప్ మెసేజ్‌లను యాక్సెస్ చేసినప్పటి నుంచి వాట్సాప్‌లో మన డేటాకు సెక్యూరిటీ ఉంటుందా, ఉండదా.. అనే అనుమానాలు అనేక మందికి కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ ఈ విషయమై ఇప్పటికే స్పష్టతనిచ్చింది కూడా. వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపేవారు, రిసీవ్ చేసుకునే వారు ఇతరులెవరికీ ఆ మెసేజ్ లు యాక్సెస్ కావని, కనీసం వాట్సాప్ కు కూడా ఆ మెసేజ్‌లను యాక్సెస్ చేసే వీలుండదని ఆ సంస్థ స్పష్టతనిచ్చింది.
అయితే వాట్సాప్‌లో డేటాను గూగుల్ డ్రైవ్, యాపిల్ ఐక్లౌడ్‌లలో సేవ్ చేస్తే మాత్రం ఆ డేటాకు ఎన్‌క్రిప్షన్ ఉండదు కనుక దాన్ని ఇతరులు యాక్సెస్ చేసేందుకు వీలుంటుందని వాట్సాప్ తెలియజేసింది. అయితే ఎవరైనా సరే తమ వాట్సాప్ డేటాను ఆయా క్లౌడ్ స్టోరేజ్‌లలో సేవ్ కాకుండా చూసుకుంటే దాంతో తమ తమ వాట్సాప్ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌ను డిజేబుల్ చేసేందుకు..
Advertisement
- వాట్సాప్‌లోకి వెళ్లాలి.
- కుడి వైపు పై భాగంలో ఉండే మూడు డాట్స్‌ను ఎంచుకోవాలి.
- సెట్టింగ్స్‌లో చాట్స్ విభాగంలో చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అనంతరం అందులో లాస్ట్ టైం బ్యాకప్ ఎప్పుడు సేవ్ చేయబడిందో చూపిస్తుంది. అందులో గూగుల్ డ్రైవ్ సెట్టింగ్స్‌లో బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత నెవర్ లేదా ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్ ఆప్షన్‌ను మాన్యువల్ సెట్టింగ్స్ కోసం ఎంచుకోవాలి.
Advertisements
ఇక ఐక్లౌడ్ అయితే ఇలా చేయాలి.
* వాట్సాప్ ఓపెన్ చేసి అందులో కింది భాగంలో కుడి వైపు కార్నర్ లో ఉండే సెట్టింగ్స్ ట్యాబ్ ను ఓపెన్ చేయాలి.
* చాట్స్ ఆప్షన్‌లో చాట్ బ్యాకప్‌ను ఎంచుకోవాలి.
* ఆటో బ్యాకప్ మీద ట్యాప్ చేయాలి.
* ఆఫ్‌ను ఎంచుకోవాలి.
దీంతో యూజర్ల వాట్సాప్ యాప్‌లలో గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ డ్రైవ్ లలో డేటా సేవ్ కాదు. ఈ క్రమంలో డేటా కేవలం ఫోన్‌లో వాట్సాప్ యాప్‌లోనే స్టోర్ అయి ఉంటుంది. అయితే ఎప్పుడైనా బ్యాకప్ కావాలనుకుంటే పైన తెలిపిన స్టెప్స్‌లోనూ ఆయా సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ డ్రైవ్, ఐ క్లౌడ్ డ్రైవ్‌లలో వాట్సాప్ డేటా బ్యాకప్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. దీంతో వాట్సాప్ డేటా బ్యాకప్ అవుతుంది. ఈ ఫీచర్ అవసరం లేదనుకుంటే, డేటాను సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే ఆయా డ్రైవ్‌లలో వాట్సాప్ డేటా బ్యాకప్ అవకుండా పైన తెలిపిన విధంగా ఆప్షన్స్‌ను ఆఫ్ చేస్తే చాలు. వాట్సాప్ డేటా సురక్షితంగా ఉంటుంది.
Advertisements