Advertisement
స్టార్ హీరోలతో సినిమా అంటేనే కోట్లలో పెట్టుబడులు…ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్స్ డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేస్తారు…కారణం స్టార్ హీరోలపై పెట్టిన పెట్టుబడి సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రీకవరీ అవుతుందనే నమ్మకం…కానీ కొన్ని సార్లు అంచనా తప్పి నిర్మాతలు భారీగా నష్టాలు చవిచూసిన సందర్భాలు అనేకమున్నాయి సినీ ఇండస్ట్రీలో.!
ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల గురించి చూద్దాం.
1) సాహో:
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా మరోసారి పాన్ ఇండియా లెవల్లో సుజిత్ తీసిన చిత్రం సాహో…. ఈ సినిమా మొత్తంగా 230 కోట్లు కలెక్ట్ చేసింది…ఇది పెట్టిన పెట్టుబడిలో 79 శాతం ….అంటే ఈసినిమాకు దాదాపు 70 కోట్ల మేరకు లాస్ వచ్చినట్టు ( ప్రపంచ వ్యాప్తంగా) , తెలుగులో చూసుకుంటే 42 కోట్ల మేర నష్టం వచ్చినట్టు.
నష్టానికి ప్రధాన కారణాలు : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పై అంచనాలు పెరగడం
: సౌతిండియా ప్రేక్షకులు ఆదరించే కథ కాకపోవడం.
Advertisements
2) అజ్ఞాత వాసి:
త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో అత్తారింటికి దారేదీ బ్లాక్ బస్టర్ తర్వాత 2018 లో రిలీజైన చిత్రం అజ్ఞాత వాసి… ఈ సినిమా పేరు మీద 68 కోట్ల నష్టం వచ్చిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : పవన్ +త్రివిక్రమ్ కాంబినేషన్ పై హై ఎక్స్ పెక్టేషన్స్
: ఫేలవమైన కథ.
3) స్పైడర్:
మురుగదాస్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై నిర్మాతలకు దాదాపు 60 కోట్ల మేరకు నష్టంవాటిల్లిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : ట‌్రైలర్ పెంచిన హైప్
: కథ…..ఈజీగా ఊహించగలిగే ట్విస్ట్ లు.
4) బ్రహ్మోత్సవం:
శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుతో తీసిన చిత్రం బ్రహ్మోత్సవం ….ఈ సినిమా పేరు మీద 54 కోట్ల నష్టం వచ్చిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : బోర్ కొట్టించే కథ
ఎక్కడా కొత్తదనం లేకపోవడం, కథను గుడుల చుట్టూతా తిప్పడం.
5) సర్దార్ గబ్బర్ సింగ్:
Advertisement
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో బాబీ డైరెక్షన్ లో పవన్ హీరోగా గబ్బర్ సింగ్ కు సీక్వెన్స్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ 45 కోట్ల నష్టాన్ని మిగిల్చిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : గబ్బర్ సింగ్ సినిమా చూసి దాని సీక్వెల్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవడం
చాలా ఓల్డ్ ఫార్మాట్ స్టోరి.
6) నేనొక్కడినే:
సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన మూవీ నేనొక్కడినే ఈ సినిమా కూడా దాదాపు 40 కోట్ల నష్టాన్ని మిగిల్చిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : ఇంకా 10 సంవత్సరాల తర్వాత రావాల్సిన కథ ఇది
సాధారణ ప్రేక్షకుల స్థాయిని దాటి తీసిన సినిమా.
7) ఆరెంజ్ :
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ప్రేమకథా చిత్రం ఆరెంజ్ దాదాపు 25 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : కొత్త కాన్సెప్ట్ ను జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోవడం.
8) వరుడు :
గుణ శేఖర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన సినిమా వరుడు. ఈ సినిమా కూడా దాదాపు 20 కోట్లకు పైనే నష్టాలను మిగిల్చిందట. బన్నీ ఈ సినిమా చేయడం రాంగ్ చాయిస్.
9) శక్తి:
మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన సినిమా శక్తి…. ఈ సినిమా కూడా 23 కోట్ల లాస్ చేసిందట!
నష్టానికి ప్రధాన కారణాలు : లాజిక్ లేని కథ , హీరో ఎలివేషన్ లేని స్టోరి.
10) పరమవీర చక్ర
దాసరి 150 వ చిత్రంగా బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం పరమవీర చక్ర….. 2010 నంది అవార్డులలో నేషనల్ ఇంటిగ్రేషన్ చిత్రం కోసం సరోజిని దేవి అవార్డును గెలుచుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా 20 కోట్ల నష్టాలను మిగిల్చిన సినిమాగా మిగిలింది ఈ సినిమా
Advertisements