Advertisement
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. కోవిడ్ జాగ్రత్తల నడుమ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఎంపీలు తప్ప మిగిలిన అందరినీ పరిమిత సంఖ్యలో పార్లమెంట్‌లోకి అనుమతిస్తున్నారు. ఇక రాజ్యసభ నిత్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అలాగే లోక్‌సభను మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
కాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అక్కడికి వచ్చే వారి కోసం క్యాంటీన్‌లో పలు భిన్న రకాల ఆహారాలను అందుబాటులో ఉంచారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ఆహారాలను ప్యాక్డ్ ఫుడ్స్ రూపంలో అందిస్తున్నారు.ఇక టీ, కాఫీలను పేపర్ కప్స్‌లో ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ క్యాంటీన్‌లో ప్రస్తుతం పలు భిన్న రకాల వెజ్, నాన్ వెజ్ ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్నం మీల్స్, బిర్యానీ, పలు స్వీట్లను అందుబాటులో ఉంచారు.
Advertisement
బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చీజ్ రోల్ (రూ.28), ఖాస్తా కచోరి (రూ.10), స్ప్రింగ్ రోల్స్ (రూ.70), సమోసా (రూ.10.90), వెజ్ ప్యాటీ (రూ.25), పనీర్ పకోడీ (రూ.15.90), వెజ్ కబాబ్ (రూ.75), వెజ్ శాండ్‌విచ్ (రూ.19.75), పనీర్‌టిక్కా (రూ.125)లను అందుబాటులో ఉంచారు. స్వీట్ అంటే ఇష్టం ఉన్నవారి కోసం గులాబ్ జామున్ (రూ.12.40), రసగుల్లా (రూ.12.50)ను కూడా అందుబాటులో ఉంచారు.
ఇక వెజ్, నాన్ వెజ్ మీల్స్ ను రూ.105, రూ.150 చెల్లించి పొందవచ్చు. అలాగే రూ.110 చెల్లిస్తే ఇడ్లీ, వడ, మినీ దోశ, మినీ ఊతప్పంతో కూడిన కోంబో ఫుడ్‌ను అందిస్తారు. ఇక వెజ్ బిర్యానీ (రూ.75), చికెన్ బిర్యానీ (రూ.100), పోహా లేదా ఉప్మా (రూ.55), ఇడ్లీ లేదా వడ (రూ.50) కూడా లభిస్తున్నాయి. ఫుడ్‌ను ప్యాక్ చేసి ఇస్తే అదనంగా మరో రూ.3 నుంచి రూ.5 చెల్లించాలి. అదే పేపర్ గ్లాస్, పేపర్ ప్లేట్ అయితే రూ.1 చెల్లించాలి.
Advertisements
Advertisements
గతంలో ఎంపీలందరూ క్యాంటీన్ లో తమకు లభించే సబ్సీడీని వదులుకోవాలనుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది! కానీ ఆ నిర్ణయం ఇంకా అమలులోకి రానట్టు కనిపిస్తుంది!