Advertisement
ఇండియాను ఉపఖండం అంటాం…ఎందుకంటే ఒక ఖండానికి ఉన్నాల్సిన అన్ని క్వాలిటీస్ ఇండియాలో మనకు కనిపిస్తాయి. అధిక చలిగా ఉండే ప్రాంతం, అత్యంత వేడిగా ఉండే ప్రాంతం,ఆగకుండా వర్షాలు కురిసే ప్రాంతం, మంచు కురిసే ప్రాంతం, ఇసుక తుఫాన్లు వచ్చే ప్రాంతం…ఇలా విభిన్న వాతావరణాలను ఇండియాలో చూడొచ్చు!
ద్రాస్
లఢక్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఓ ప్రాంతం ద్రాస్…ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత చలిగా ఉండే ప్రాంతం…అప్పుడప్పుడు ఇక్కడి ఉష్ణోగ్రతలు -22 డిగ్రీ సెల్సియస్ కు పడిపోతుంటాయి! అయినా ఇక్కడ ఇప్పటికీ మనుషులు తమ జీవితాలను చాలా సంతోషంగా కొనసాగిస్తూనే ఉన్నారు.!
చురు :
రాజస్థాన్ లోని చురు అనే ప్రాంతంలో వేసవిలో ఎండ 50 డిగ్రీలను దాటుతుంది. అయినా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో అక్కడి ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.!
Advertisement
Advertisements
చిరపుంజి
ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రాంతం…ఏడాదంతా వర్షం కురుస్తున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది! ఏడాదికి 12063 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు చేసుకుంది. అయినా అదే వర్షంలో అక్కడి ప్రజలు తమరోజును గడుపుతుంటారు.!
జైసల్మేర్ :
కోటల నగరంగా పేరుపొందిన జైసల్మేర్…భయంకర ఇసుక తుఫాన్లకు పెట్టింది పేరు. ఇసుకంతా గాల్లోకి లేచి…. గంటల పాటు ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా భయపెడుతుంది. అయినా అక్కడి ప్రజలు దీన్ని అలవాటు చేసుకొని తమ లైఫ్ ను లీడ్ చేస్తూనే ఉన్నారు.!
Advertisements