Advertisement
మన సమాజంలో ఉండే మేథావులు నిజంగా ఒక్కోసారి అస్సలు అర్థం కారు. వారు చేసే పనులు కూడా చిత్రంగా ఉంటాయి. వారిలో కొందరు చాలా నిరాడంబరమైన జీవితం గడుపుతారు. సామాన్య ప్రజల్లో కలసిపోయి ఉంటారు. అందువల్ల వారిని ఒక్కోసారి గుర్తించడం కూడా కష్టమే. సరిగ్గా ఆయన కూడా ఇలాగే చేశారు. నిజానికి ఆయన ఓ ఆర్థికవేత్త. అయితే రహదారి పక్కన కొందరితో కలిసి భోజనం తింటూ కనిపించారు. దీంతో ఆయన్ను అందరూ బిచ్చగాడని అనుకున్నారు. కానీ ఆరా తీస్తే అతను ఓ మేథావి అని తేలింది.
పైన ఇచ్చిన చిత్రంలో రహదారి పక్కన కొందరి మధ్యలో బ్లూ షర్ట్ వేసుకుని, స్లిప్పర్లు ధరించి కనిపిస్తున్నాడు కదా. అతని వెనుక ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని చూసి చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయుడు తినడానికి తిండి లేక అలా జీవిస్తున్నాడని ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. కానీ అసలు విషయం అది కాదు. ఆయన కూర్చుని ఉన్న ప్రదేశం ఓ గురుద్వారాకు సమీపంలోనిది. అక్కడ నిత్యం ప్రజలకు రెండు రొట్టెలను భోజనంగా పెడతారు. వాటిని తినేందుకు ఆ విదేశీయుడు అక్కడ కూర్చున్నాడు.
Advertisement
Advertisements
ఇక అతని పేరు జీన్ డ్రెజ్. బెల్జియం వాసి. ఇండియాకు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఆయనకు భారత పౌరసత్వం కూడా ఉంది. ఈయన నిజానికి ఓ గొప్ప ఆర్థికవేత్త. ఎంఎన్ఆర్ఈజీఏ ను డ్రాఫ్ట్ చేసింది ఈయనే. ఆర్‌టీఐ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేసిన వారిలో ఈయన కూడా ఒకరు. 1979లో బెల్జియం నుంచి ఇండియాకు వచ్చి 2002లో భారత పౌరసత్వం పొందారు.
Advertisements
అయితే డ్రెజ్ అక్కడ రొట్టెలను తినేందుకే కూర్చున్నాడా.. లేదా మరేదైనా కారణం ఉందా.. అనేది తెలియలేదు. కానీ ఆయన ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. నిజంగా మేథావులు కొన్నిసార్లు ఏం చేస్తారో ఎవరికీ అంతుబట్టదు.