Advertisement
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఉన్నత శిఖరాలకు చేరుకున్నా.. వ్యక్తులు ఎవరైనా సరే.. అణకువగా ఉండాలి. అదే వారికి మరిన్ని పేరు ప్రఖ్యాతులను, కీర్తిని తెచ్చి పెడుతుంది. సమాజంలో అలాంటి వారే మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు. వారిలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకడు. ధోనీ నిజానికి మైదానంలోనే కాదు.. బయట కూడా చాలా కూల్‌గా ఉంటాడు. తాను ఓ పెద్ద క్రికెటర్‌ను అనే విషయం మరిచిపోతాడు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. అందుకు ఈ రెండు సంఘటనలే ఉదాహరణలు.
అప్పట్లో.. అంటే.. ధోనీ క్రికెటర్ కాకముందు టీటీఈగా పనిచేసినప్పుడు ఖరగ్‌పూర్‌లో థామస్ అనే వ్యక్తికి చెందిన టీ స్టాల్ వద్దకు వెళ్లి నిత్యం 2-3 కప్పుల టీ తాగేవాడు. అయితే ఈ ఏడాది మార్చిలో కోల్‌కతాలో విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా మ్యాచ్‌లో ధోనీ థామస్‌ను చూశాడు. వెంటనే అతన్ని గుర్తుపట్టి దగ్గరకు తీసుకున్నాడు. అనంతరం అతనికి ధోనీ చక్కని డిన్నర్ పార్టీ ఇచ్చాడు. అదీ ధోనీలో ఉన్న సింప్లిసిటీకి నిదర్శనం.
Advertisement
Advertisements
ఇక ధోనీ హెలికాప్టర్ షాట్ ఆడుతాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దాన్ని అతను కనిపెట్టలేదు. అతని ఫ్రెండ్ సంతోష్ లాల్ కనిపెట్టాడు. ధోనీలాగే అతను కూడా క్రికెటర్. ఇద్దరూ గతంలో ఇండియన్ రైల్వేస్‌లో పనిచేశారు. అలాగే క్రికెట్ మ్యాచ్‌లూ ఆడేవారు. ఈ క్రమంలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చాడు. అయినప్పటికీ తన స్నేహితున్ని మాత్రం ధోనీ మరువలేదు. 2013 జూలైలో సంతోష్ లాల్ పాంక్రియాటైటిస్‌తో బాధపడుతుండగా ధోనీ అతన్ని చికిత్స కోసం ఢిల్లీకి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ సంతోష్ దురదృష్టవశాత్తూ మృతి చెందాడు. అది ధోనీకి తీరనిలోటు. అయినప్పటికీ తన స్నేహితుడి గుర్తుగా ధోనీ ఆ షాట్‌ను ఇప్పటికీ ఆడుతూనే ఉంటాడు. ధోనీ గొప్పతనాన్ని వర్ణించేందుకు ఈ రెండు సంఘటనలు చాలు..!
Advertisements