Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు ఎన్నుకునే విధానాన్ని బట్టి పాలకులు దేశాలను పాలిస్తుంటారు. అయితే ఇప్పటికీ కొన్ని దేశాలను రాజులే ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నారు. అలాంటి దేశాల్లో స్వాజిలాండ్ కూడా ఒకటి. దాన్నే ఇస్వతిన్ రాజ్యం అని కూడా పిలుస్తారు. ఆ దేశాన్ని కింగ్ మస్వతి III పాలిస్తున్నాడు. ఇతనికి 15 మంది భార్యలు, 23 మంది పిల్లలు ఉన్నారు. తన కంటబడిన మహిళలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. కానీ అవేవీ ఇప్పటి వరకు రుజువు కాలేదు. కావు కూడా. ఎందుకంటే అతను ఓ దేశానికి రాజు కదా.
ఇక బ్రిటిష్ కింగ్‌కు ఉన్నట్లే ఇతనికి కూడా దేశంపై అన్ని అధికారాలు ఉంటాయి. ఈ రాజు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. దేశానికి కేటాయించే బడ్జెట్‌తోపాటు ఇతని కుటుంబానికి కూడా ఏటా బడ్జెట్ కేటాయిస్తారు. అది 61 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.456 కోట్లు) వరకు ఉంటుంది. అలాగే 5 లక్షల డాలర్ల (దాదాపుగా రూ.3.74 కోట్లు) విలువైన డైమ్లర్ క్రిజ్లర్ ఫ్లాగ్‌షిప్ మేబ్యాక్ 62 లగ్జరీ కారు కూడా ఇతనికి ఉంది. ఇక ఈ రాజు ఆస్తి విలువ 200 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.1497 కోట్లు) వరకు ఉంటుంది.
Advertisement
Advertisements
కాగా ఇతని తండ్రి పేరు కింగ్ సొభుజా II. 1968 సెప్టెంబర్ 6న బ్రిటిష్ వారు స్వాజిలాండ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారు. అప్పటి నుంచి కింగ్ సొభుజా ఆ దేశ రాజ్యాంగం, పార్లమెంట్‌ను రద్దు చేసి తానే రాజై ఆ దేశాన్ని పాలించడం మొదలు పెట్టాడు. అతనికి దేశం సంపదపై పూర్తి నియంత్రణ ఉండేది. దాన్ని తన సొంత సంపదగా వాడుకోవడం మొదలు పెట్టాడు. దీంతో అతని కుమారుడు కూడా ఇప్పుడదే పని చేస్తున్నాడు. 1920 నుంచి 1970 మధ్య సొభుజాకు 70 మంది భార్యలు, 210 మంది పిల్లలు ఉండేవారు. 1982లో అతను చనిపోయాడు. అప్పటికి అతనికి 1000 మందికి పైగా మనవళ్లు, మనవరాళ్లు ఉండేవారు. అవును.. ఎంతైనా రాజులు కదా.. వారికి ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది.
Advertisements