Advertisement
బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయ కారకులని అంటారు. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల విష్ణువు, శివుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక ఇద్దరు దేవుళ్లను పూజించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే శివుడికి కార్తికేయుడు, వినాయకుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. కానీ ఆయనకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడికి అశోక సుందరి, మానస, జ్యోతి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పద్మపురాణంలో అశోక సుందరికి చెందిన అన్ని వివరాలను మనం తెలుసుకోవచ్చు. గుజరాత్‌లో ఎక్కువగా ఈమెకు చెందిన వ్రత కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఈమెను పూజిస్తారు. శివుడు వినాయకుడి తలను నరికినప్పుడు ఈమె అక్కడ ఉప్పు బస్తా పక్కన దాక్కుని ఉందట. అందుకనే ఈమెకు, ఉప్పుకు సంబంధం ఉంటుందని చెబుతారు.
Advertisement
ఇక మానసకు పాముకాటుకు గురైన వారిని రక్షించే దేవతగా పేరుంది. పాముల జాతికి చెందిన కద్రుకు, శివుడికి ఈమె జన్మించిందని చెబుతారు. అందువల్లే ఈమె శివుడి కుమార్తె అయింది. ఆమెకు అలాంటి వరం లభించింది. ఇక సముద్ర మథనం సందర్భంగా శివుడు గరళాన్ని తాగినప్పుడు మానస శివున్ని రక్షించిందని చెబుతారు. అయితే శివుడు, పార్వతి, తన భర్త ఆమెను సరిగ్గా ఆదరించలేదని, అందుకనే ఆమె ఎప్పుడూ కోపంగా ఉంటుందని చెబుతారు. ఈమెను పశ్చిమబెంగాల్‌లో ఎక్కువగా పూజిస్తారు.
శివుడి మూడో కుమార్తె అయిన జ్యోతి శివుడి దివ్య జ్యోతి నుంచి జన్మించిందని చెబుతారు. అందువల్లే ఆమెకు జ్యోతి అనే పేరు వచ్చిందని అంటారు. పూర్తిగా శివుడి దివ్యాంశలో ఈమె జన్మించింది. కాంతి దేవత అని కూడా ఈమెను పిలుస్తారు. ఈమెను రయకి దేవత అని పిలుస్తారు. ఉత్తరాదిలో జ్వాలాముఖి పేరిట ఈమెకు పూజలు చేస్తారు. తమిళనాడులో ఈమె ఎక్కువగా పూజలు అందుకుంటుంది.
Advertisements