Advertisement
వేసవి వస్తుంది అంటే చాలు మనం చల్లగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇక వేసవి కాలంలో ప్రధానంగా కళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. బండి మీద ప్రయాణాలు ఉన్న వారు, ఎండలో ఏదైనా పని చేసే వారు కళ్ళ విషయంలో కాస్త కేర్ తీసుకుంటారు. నగరాల్లో అయితే మరీ దారుణంగా పరిస్థితి ఉంటుంది. వేసవిలో వేడికి తగ్గట్టు కాలుష్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రయాణం చేయాలి అంటే నరకం చూడాలి.
అందుకే కళ్ళ విషయంలో కాస్త దృష్టి పెడతారు. వేసవిలో వేడి ఎక్కువగా ఉండటమే కాకుండా కంటి సమస్యలను కలిగించే అతి నీల లోహిత కిరణాలు ఎక్కువగా సూర్యుడు నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి కళ్ళను రక్షించుకోవడానికి మన ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం సన్ గ్లాసెస్. హేల్మేంట్ కంటే వీటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చాలా మంది.
Advertisement
అయితే గతంలో ఎండ నుంచి కళ్ళను రక్షించుకోవడానికి చాలా మంది… జంతువుల దంతాల్ని చదునుగా చేసి వాటిని ఉపయోగించి కళ్ళను రక్షించుకునే వారు. రోమ్, చైనా చరిత్ర ప్రకారం చూస్తే… రోమన్ చక్రవర్తి నీరో తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన సైనికుల పోరాటాల్ని చూడటానికి పాలిష్ చేసిన రత్నాలను ధరించే వారు అని… వాటిని ఆధారంగా చేసుకునే నేడు సన్ గ్లాసెస్ వచ్చాయని చెప్తూ ఉంటారు.
Advertisements
మన పక్కన ఉన్న చైనాలో 12 వ శతాబ్దానికంటే ముందే ఈ గ్లాస్ లను వాడారని చరిత్ర కారులు చెప్తున్నారు. 12వ శతాబ్దంలో ఈ సన్ గ్లాసెస్ ను గోధుమ, బూడిద రంగు లేదా నలుపు రంగురాళ్లతో తయారు చేసి విక్రయించే వారు. అయితే వీటి వలన ఏ ఉపయోగం ఉండకపోవడమే కాకుండా సూర్య కిరణాలు నేరుగా కంటికి తాకేవి. ఇక అసలు వీటిని ఎందుకు వాడారో తెలుసుకునే ప్రయత్నం కూడా కొందరు చేసారు.
Advertisements
పురాతనమైన డాక్యుమెంట్లు లేదా ఇతర కీలక సమాచారాన్ని రహస్యంగా విశ్లేషించడం, చదవడం కోసం ఉపయోగించారు అని… చరిత్రలో చైనాకు చెందిన కొన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులు నిందితుల్ని విచారించే సందర్భంలో వారి హావభావాలను గుర్తించకుండా ఉండటానికి క్రిస్టల్ సన్ గ్లాసెస్ ను ఉపయోగించారని తెలిసింది. వాటి ఆధారంగానే 1752 లో జేమ్స్ ఐస్కాఫ్ అనే శాస్త్రవేత్త ఈ సన్ గ్లాసెస్ ని తయారు చేయడం మొదలుపెట్టారని అంటారు.