Advertisement
క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్‌కు వికెట్ పడిందంటే పండగే. కొన్ని సార్లు ఒక్క వికెటే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తుంది. మ్యాచ్ స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ క్రమంలోనే బౌలర్లు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు 10 రకాలుగా ఔట్ చేయవచ్చు.
వికెట్లను బౌల్డ్ చేయడం, క్యాచ్ పట్టడం, లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్‌బీడబ్ల్యూ), రన్ అవుట్, స్టంప్ అవుట్, హిట్ వికెట్ ఇలా పలు రకాలుగా బ్యాట్స్‌మెన్ ఔట్ అవడాన్ని మనం చూశాం. అయితే ఇవే కాదు.. ఇంకా పలు మార్గాల్లోనూ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేయవచ్చు. అవేమిటంటే…
1. ఫీల్డింగ్‌ను అడ్డుకోవడం
బ్యాట్స్‌మెన్ కావాలనే తన చర్యలు లేదా మాటల ద్వారా ఫీల్డింగ్‌ను అడ్డుకున్నా.. లేదా ఫీల్డింగ్ టీం విసిరిన బంతిని వికెట్లకు తాకకుండా కావాలనే అడ్డుకున్నా.. అంపైర్లు ఔట్ ఇస్తారు. దీన్ని ఫీల్డింగ్‌ను అడ్డుకోవడం కింద భావించి ఔట్ ఇస్తారు.
2. రిటైర్డ్ అవుట్
Advertisements
ఎవరైనా ఒక బ్యాట్స్‌మెన్ మ్యాచ్ సందర్భంగా గాయాలకు గురైతే అతను రిటైర్డ్ హర్ట్ రూపంలో వెనుదిరుగుతాడు. అయితే మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్లందరూ ఔట్ అయ్యాక రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాట్స్‌మన్ మాత్రమే ఉంటే.. అతను ఆడే స్థితిలో ఉంటే మ్యాచ్ ఆడవచ్చు. లేకపోతే ఆ బ్యాట్స్‌మన్‌ను రిటైర్డ్ అవుట్‌గా ప్రకటించి ఇన్సింగ్స్‌ను ముగిస్తారు.
Advertisement
3. బంతిని రెండు సార్లు కొట్టడం
ఎవరైనా ఒక బ్యాట్స్‌మన్ బంతిని రెండు సార్లు కొడితే నియమాల్లోని సెక్షన్ 34 ప్రకారం అతన్ని ఔట్‌గా పరిగణిస్తారు. కావాలనే బంతిని రెండో సారి కొడితే ఆ విధంగా ఔట్ ఇస్తారు.
4. టైమ్డ్ అవుట్
మ్యాచ్ సందర్భంగా ఒక బ్యాట్స్‌మన్ ఔట్ అయ్యాక తరువాత వచ్చే బ్యాట్స్‌మన్ నిర్దిష్టమైన టైం లిమిట్‌లోగా డ్రెస్సింగ్ రూం నుంచి క్రీజులోకి చేరుకోవాలి. ఈ సమయం వన్డేలు, టెస్టులకు 3 నిమిషాలు ఉంటుంది. అదే టీ20లకు అయితే 2 నిమిషాలు ఉంటుంది. అందుకనే టీ20ల సందర్భంగా తరువాత బరిలోకి దిగే బ్యాట్స్‌మెన్లు గ్రౌండ్ బయటే డగ్ అవుట్‌లో సిద్ధంగా ఉంటారు. దీని వల్ల ఒక ప్లేయర్ ఔట్ అవ్వగానే తరువాత వచ్చే ప్లేయర్ వేగంగా క్రీజులోకి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే భారత్, సౌతాఫ్రికాల మధ్య గతంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ క్రీజులోకి వచ్చేందుకు 5 నిమిషాల సమయం తీసుకున్నాడు. అయినప్పటికీ సౌతాఫ్రికా ప్లేయర్లు అంపైర్లకు అప్పీల్ చేయలేదు. దీంతో దాదా మ్యాచ్‌లో కొనసాగాడు. సాధారణంగా ఈ విధానంలో అవుట్ అయ్యే ప్లేయర్లు దాదాపుగా తక్కువగానే ఉంటారని చెప్పవచ్చు.
Advertisements