Advertisement
హిందూ దేవుళ్లలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు కొలుస్తారు. ఆంజనేయ స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం హనుమంతుడు నిజానికి బ్రహ్మచారే. కానీ ఆయన వివాహం చేసుకున్నాడు. అవును నిజమే.. దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమంతుడు తన గరువు సూర్య దేవుడి వద్ద అన్ని విద్యలను అభ్యసించాడు. ఇంక నేర్చుకోవడానికి ఏమీ మిగలలేదు. అయితే ఒక్క విద్య మాత్రం మిగిలిపోయింది. కానీ దాన్ని నేర్చుకోవాలంటే వివాహం చేసుకుని ఉండాలి. అయితే హనుమంతుడు బ్రహ్మచారి కనుక ఇక తనకు ఆ ఒక్క విద్య నేర్చుకునే అవకాశం లేదని బాధపడసాగాడు.
Advertisement
అది గమనించిన సూర్య దేవుడు హనుమంతుడి వద్దకు వచ్చి చెబుతాడు. హనుమా.. నువ్వు నా కుమార్తె సువర్చలను పెళ్లి చేసుకో. నా దగ్గర మిగిలిన ఆ విద్యను కూడా నేర్చుకో. కానీ గృహస్థుడవు కావల్సిన పనిలేదు. వివాహం జరిగిన వెంటనే నా కుమార్తె తపస్సుకు వెళ్లిపోతుంది. నువ్వు బ్రహ్మచారిగానే ఉంటావు. గృహస్థుగా ఉండాల్సిన పనిలేదు.. అని సూర్య దేవుడు అంటాడు. అందుకు హనుమంతుడు సరేనని అంగీకరిస్తాడు.
Advertisements
Advertisements
తరువాత సూర్యదేవుడి వద్ద హనుమంతుడు ఆ మిగిలిన ఒక్క విద్యను నేర్చుకుంటాడు. అనంతరం ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాడు. కానీ ఆయనను పెళ్లాడిన సువర్చల మాత్రం తపస్సు కోసం అరణ్యానికి వెళ్లిపోతుంది. కానీ సంసారం అనే మాట రాదు. అందువల్ల హనుమంతుడికి వివాహం జరిగింది. కానీ ఆయన విద్య నేర్చుకోవడం కోసమే పేరుకు వివాహం చేసుకున్నాడు. ఏనాడూ గృహస్థు కాలేదు. దీని గురించి పరాశర సంహితలో చదివి తెలుసుకోవచ్చు.