Advertisement
డబ్బు ఎక్కువగా ఉంటే కొందరు ధనికులు విచ్చలవిడిగా దాన్ని ఖర్చు చేస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. నిత్యం విందులు, వినోదాల్లో మునిగి తేలుతుంటారు. అయితే ఆ నవాబు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే అతను తన దగ్గర ఉన్న డబ్బునంతా కేవలం తన పెంపుడు కుక్కల కోసమే ఖర్చు పెట్టేవాడు మరి.
జునాగఢ్ రాష్ట్రం (గుజరాత్)ను చివరిసారిగా పాలించిన నవాబు మొహబ్బత్ ఖాన్ రసూల్ ఖాన్-3 కుక్కల ప్రేమికుడు. వాటిని అతను ఎంతగా ప్రేమించేవాడంటే ఏకంగా అతను 2వేలకు పైగా కుక్కలను పెంచుకునేవాడు. వాటికి రాజభోగాలు ఉండేవి. ఒక్కో కుక్కకు ఒక్కో ప్రత్యేక గది ఉండేది. వాటికి పనిచేసేందుకు పనివాళ్లు ఉండేవారు. కార్లలో తిరిగేవి. ధనికులు తీసుకునే ఆహారం వాటికి పెట్టేవారు. అలా ఆ నవాబు తన ధనాన్నంతా మొత్తం కుక్కల కోసమే ఖర్చు పెట్టేవాడు.
Advertisement
అంతేకాదు.. తన వద్ద ఉండే రాజ కుక్క రోషనారకు మరో కుక్క బాబికి పెళ్లి చేశాడు. తన దగ్గర ఉండే ఇతర కుక్కలకు కూడా ఘనంగా పెళ్లిళ్లు చేయించేవాడు. ధనికుల ఇండ్లలో జరిగే వివాహాలను పోలి ఆ పెళ్లిళ్లు ఉండేవి. అప్పట్లో ఎంతో మంది అతిథులను కూడా అతను ఆ పెళ్లిళ్లకు ఆహ్వానించేవాడు. అప్పట్లో వైశ్రాయ్ లార్డ్ ఇర్విన్ వంటి ప్రముఖులు ఆ నవాబు కుక్కల పెళ్లిళ్లకు హాజరు అయ్యేవాడు. ఒక్కో వివాహానికి ఏకంగా 1 లక్ష మంది వరకు అతిథులు వచ్చేవారు.
Advertisements
ఇక పెళ్లి జరిగే కుక్కలకు ఆభరణాలు, దుస్తులను ఆ నవాబు ధరింపజేసేవాడు. అయితే భారత్, పాకిస్థాన్ విడిపోయాక ఆ నవాబు తన భార్యలను వద్దనుకుని కుక్కలనే దగ్గర ఉంచుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి భారత ప్రభుత్వం ఆ నవాబు భార్యలను పాకిస్థాన్‌కు పంపించింది. అలా ఆ నవాబు జీవితం మొత్తం కుక్కలతోనే గడిచింది. వాటికోసమే తన వద్ద ఉన్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. అవును మరి. కొందరు ధనికులు అంతే. ఇబ్బడిముబ్బడిగా డబ్బు ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. ఇదిగో ఇలాంటి పనులే చేస్తుంటారు.
Advertisements