Advertisement
PPE కిట్ ధరించి… స్ట్రీట్ డాన్సర్ 3D సినిమాలోని ‘గర్మీ’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ …రిచా నేగి అనే డాక్టర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో…. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది!
కరోనతో ఇండియాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ముంబాయిలో…. పేషెంట్స్ కు ట్రీట్మెంట్ చేసే రిచా నేగి…తన డాన్స్ వీడియోతో పాటు తన ఫీలింగ్స్ ను కూడా పంచుకున్నారు.!
” ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ మోముపై చిరునవ్వు చెరగకుండా…దేశ సేవ చేస్తున్న నా సహ డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు…! మనమంతా పాజిటివ్ గా ఉంటేనే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం…గర్మీ ( వేడి) …ఇప్పుడు ఈ PPE కిట్స్ ధరించి ప్రతి డాక్టర్ ఆ వేడిని డైరెక్ట్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి.. ఈ పాట ఇప్పుడు కరెక్ట్ గా సింక్ అయినట్టు అనిపించి…ఈ వీడియో చేస్తున్నాను”. అని రిచా నేగి పోస్ట్ చేశారు.
అయితే ఈ పోస్ట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యంతో పాటు ఆమె డాన్స్ ను పొగుడుతుంటే..మరికొంత మంది మాత్రం ఇదేందిది? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.
Watch Video :
Advertisements
Advertisement
View this post on Instagram
Advertisements